The Kerala Story Collection: 'ది కేరళ స్టోరీ' కలెక్షన్ల సునామీ.. 6 రోజుల్లో వచ్చింది ఎన్ని కోట్లంటే?
ఇటీవల కాంట్రవర్సీ పాలైన బాలీవుడ్ మూవీ ది కేరళ స్టోరీ. హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల నుంచి అనేక విమర్శలు తలెత్తాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పలువురు నిరసనలు కూడా తెలిపారు.
అయినా మొత్తానికి మే 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇక మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో ది కేరళ స్టోరీ 6వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

వివాదాల మధ్య: బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ది కేరళ స్టోరి. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా క్రియేటివ్ డైరెక్టర్ గా విపుల్ అమృత్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమాలో అదా శర్మతోపాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక అనేక వివాదాల మధ్య మే 5న రిలీజ్ అయింది ఈ సినిమా.

షోలు క్యాన్సిల్: ది కేరళ స్టోరీ సినిమాను మొత్తంగా రూ. 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు సమాచారం. వివాదాలతో హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీని భారతదేశంలో మొత్తంగా 2 వేల స్క్రీన్లలో విడుదల చేశారు. అయితే కాంట్రవర్సీ కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం తదితర నగరాల్లోని మల్టీ ప్లెక్స్ థియేటర్లలో ఈ మూవీ షోలు క్యాన్సిల్ చేసినట్లుగా సమాచారం అందింది.

ఆక్యుపెన్సీ డీటేల్స్: ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాకు తొలి రొజు నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అందుకే థియేటర్ ఆక్యుపెన్సీ కూడా బాగానే నమోదు అవుతోంది. ఈ నేపథ్యంలో 6వ రోజు ఆక్యుపెన్సీ డీటేల్స్ చూస్తే.. ఉదయం 17.86 శాతం, మధ్యాహ్నాం 30.47 శాతం, సాయంత్రం 31.80 శాతంగా రిజిస్టర్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

6వ రోజు వసూళ్లు: ది కేరళ స్టోరీ మూవీ మత మార్పిడి కథా నేపథ్యంగా తెరకెక్కింది. ఈ సినిమాలో కేరళకు చెందిన వేలాది మంది యువతులను ఐసీస్ (ISIS) ఇస్లాం మతంలోకి మార్చినట్లు చూపించిన అంశం సంచలనంగా మారింది. దీంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మూవీ 6వ రోజున రూ. 12 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే గత 3 రోజులతో పోల్చుకుంటే వసూళ్లు మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది.

ఏరోజు ఎంతంటే?: అదా శర్మ లేటెస్ట్ హిందీ మూవీ ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇక ఈ మూవీ ఆరు రోజుల్లో రూ. 68.86 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ సాధిస్తుందని అంచనా. అంటే పెట్టిన బడ్జెట్ రూ. 35 కోట్లు దాటి అధికంగా నెట్ లాభాలు అర్జించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ 5 రోజుల్లో వరుసగా.. రూ. 8.03 కోట్లు, రూ. 11.22 కోట్లు, రూ. 16.4 కోట్లు, రూ. 10.07 కోట్లు, రూ. 11.14 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











