గబ్బర్ సింగ్, దరువును...బీట్ చేసిన ‘అధినాయకుడు’!

By Bojja Kumar

నందమూరి నటసింహం బాలయ్య నటించిన 'అధినాయకుడు' చిత్రం జూన్ 1న విడుదలై యూఎస్ బాక్సాఫీసులో మంచి కలెక్షన్లతో దూసుకెలుతోంది. చివరి వారం 1, 2 తేదీల్లో యూఎస్‌లో కలెక్షన్ల విషయానికొస్తే.....'అధినాయకుడు' టాప్ పొజిషన్లో నిలిచింది. 'అధినాయకుడు' చిత్రం గడిచిన వారం అమెరికా వ్యాప్తంగా రూ. 10 లక్షల వసూళ్లు సాధిస్తే.....గబ్బర్ సింగ్ రూ. 5 లక్షలు, దరువు రూ. 1 లక్ష వసూలు చేసింది.

ట్రేడ్ అనాలసిస్ట్ తరణ్ ఆదర్శన్ మాట్లాడుతూ....'జూన్ 1న విడుదలైన అధినాయకుడు చిత్రానికి యావరేజ్ రెస్పాన్ వస్తోంది. తొలి రోజు ఈచిత్రం Rs 5,45,158 ($9,844) వసూలు చేసినట్ల తెలిపారు. రెండో రోజు బిజినెస్ కాస్త తగ్గి Rs 4,60,041 ($8,307) వసూలు చేసింది. రెండు రోజుల్లో కలెక్షన్లు Rs 10,05,200 లకు చేరింది' అని తెలిపారు.

గబ్బర్‌సింగ్ విషయానికొస్తే... నాలుగో వారంలోనూ ఈచిత్రం మంచి ఊపుతో నడుస్తోంది. అధినాయకుడు రిలీజ్ రోజైన శుక్రవారం ఈచిత్రం Rs 1,85,467 ($3,349), శనివారం Rs 3,02,596 ($5,464) చేసిందని తెలిపారు. గడిచిన 23 రోజులుగా గబ్బర్ సింగ్ చిత్రం Rs 5.64 కోట్లు ($1,016,276) వసూలు చేసినట్లు రికార్డు సృష్టించినట్లుగా ఆయన వెల్లడించారు.

ఇక రవితేజ దరవు విషయానికొస్తే...అధినాయకుడు రిలీజైన శుక్రవారం ఈ చిత్రం Rs 55,517 ($1,002) వసూళ్లు సాధించింది. శనివారం కాస్త పుంజుకుని Rs 84,495 ($1,525) వసూళ్లు సాధించింది. దరువు చిత్రం మే 25న విడుదలై ఇప్పటి వరకు Rs 31.75 లక్షలు ($57,159) వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X