Adikeshava Collections 10 కోట్ల బిజినెస్.. ఆదికేశవ లాభాల్లోకి రావాలంటే?
మెగా హీరో వైష్ణవ్ తేజ్ పంజా, టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ఆదికేశవ. నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి, ప్రముఖ నిర్మాత నాగవంశీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం నవంబర్ 24 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ ఈవెంట్స్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఏ మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది? రిలీజ్ తర్వాత కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాలంలో శ్రీలీల సినిమాలకు భారీగా ఆదరణ దక్కుతున్నది. ఇక ఉప్పెన సినిమాతో మంచి విజయం అందుకొన్న వైష్ణవ్ తేజ ఆమెకు జత కలవడంతో క్రేజీ కాంబినేషన్ అనే పేరు మార్మోగింది. అయితే బజ్‌కు తగినట్టుగా పాటలు విశేషం ఆదరణ దక్కడం, శ్రీలీల డ్యాన్సులకు మంచి ఊపు రావడంతో ఆదికేశవ మూవీపై అందరి దృష్టి పడింది.

80
ఇక ఆదికేశవ సినిమా రిలీజ్ తర్వాత క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ రాగా, ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ వర్డ్ స్ప్రెడ్ అయింది. అయితే ఇలా మిక్స్‌డ్ టాక్‌తో వచ్చిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ పరంగా తడబాటుకు గురైంది. ఇక ఈ సినిమా మౌత్‌తో కలెక్షన్లు పెరుగుతాయా? అనేది వేచి చూడాల్సిన విషయంగా కనిపిస్తున్నది.

ఆదికేశవ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను 20 కోట్ల రూపాయలతో సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమా కాంబినేషన్‌పై అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్, థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా హక్కులు 9.5 కోట్ల మేర అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఆదికేశవ చిత్రానికి ఓ మోస్తారు బజ్ ఉండటంతో వైష్ణవ్ తేజ్ కెరీర్‌లోనే భారీగా థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 400 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఇక ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాను సుమారుగా 900 స్క్రీన్లలో రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే తొలి రోజు పెద్దగా ఆక్యుపెన్సీ నమోదు కాకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక ఆదికేశవ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు స్లో అండ్ స్టడీగా మొదలయ్యాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇండియాలో 80 లక్షల నికర వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారాంతంలో ఈ సినిమా మెరుగైన కలెక్షన్లను రాబడితే గానీ.. 10 కోట్ల బ్రేక్ ఈవెన్ దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











