Adipurush కలెక్షన్లు దారుణంగా.. టికెట్ రేట్లలో భారీ తగ్గింపు.. ఏపీ, తెలంగాణకు ట్విస్ట్.. టికెట్ రేట్ ఎంతంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ అనేక వివాదాల మధ్య థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తున్నది. సైఫ్ ఆలీ ఖాన్, కృతిసనన్ నటించిన ఈ చిత్రం కొన్ని వర్గాలను సంతృప్తి పరచకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్లను సాధిస్తున్నది. తొలి మూడు రోజుల్లో బంపర్ కలెక్షన్లు సాధించిన చిత్రం నాలుగో రోజు నుంచి పేలవమైన వసూళ్లను సాధిస్తున్నది. దాంతో ఈ చిత్రం గురించి నిర్మాతలు తీసుకొన్న అనూహ్యమైన నిర్ణయం ఏమిటంటే?

ఆదిపురుష్ చిత్రం రిలీజ్ తర్వాత లెక్కలేనన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓం రావత్, డైలాగ్ రైటర్ మనోజ్‌పై నెటిజన్లు, సినీ ప్రేక్షకులు, హిందుత్వ సంస్థలు, రామాంజనేయ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఉన్నట్టుంది సోమవారం నుంచి ఈ సినిమా పూర్తిగా నెగిటివ్ జోన్‌లోకి వెళ్లింది. దాంతో టికెట్ రేట్లపై భారీగా నిర్మాతలు కోతపెట్టడం సెన్సేషన్‌గా మారింది.

Adipurush 3D Version Ticket rates slashed heavily in National Multiplex chains after Box office crash

ఆదిపురుష్ బాక్సాఫీస్ రిపోర్టు చాలా దారుణంగా ఉండటంతో చిత్ర నిర్మాతలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర 330 రూపాయలు. 37 రూపాయల ట్యాక్స్‌లతో కలిపి మొత్తం ఒక్క టికెట్‌కు 367 రూపాయలు. కలెక్షన్లు పడిపోవడంతో నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లలో 3డీ ఫార్మాట్‌కు సంబంధించిన టికెట్ రేట్లను భారీగా కోత పెట్టారు.

ఇక గురువారం అంటే జూన్ 21వ తేదీ నుంచి తగ్గించిన టికెట్ రేట్లు అమల్లోకి వస్తాయని నిర్మాతలు తెలిపారు. నేషనల్ చైన్స్ మల్టీప్లెక్స్‌లో 3డీ టికెట్‌ను 150 రూపాయలను టికెట్ రేటుగా నిర్ణయించారు. దాంతో ఈ సినిమాను తక్కువ ధరకే ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్ తగ్గిస్తూ తీసుకొన్న నిర్ణయంపై టీ సిరీస్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తక్కువ ధరకే బిగ్ స్క్రీన్‌పై 3డీ వెర్షన్‌లో ఆదిపురుష్ సినిమాను చూడండి. ఇక నుంచి టికెట్ ధర కేవలం 150 రూపాయలే. 3డీ గ్లాసెస్‌కు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో టీ సిరీస్ తెలిపింది.

Adipurush 3D Version Ticket rates slashed heavily in National Multiplex chains after Box office crash

అయితే దక్షిణాది రాష్ట్రాలకు టీ సిరీస్ భారీ ట్విస్టు ఇచ్చింది. తగ్గించిన టికెట్లు రేట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వర్తించవు. ఈ రాష్ట్రాల్లో టికెట్ రేట్లు యధావిధిగాను ఉంటాయి అని ప్రకటనలో టీ సిరీస్ వెల్లడించింది. దాంతో దక్షిణాది ప్రేక్షకుల నిరాశకు లోనయ్యారు.

ఇదిలా ఉండగా, ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 395 కోట్ల వసూళ్లను గత ఐదు రోజుల్లో కలెక్ట్ చేసింది. ఏపీ తెలంగాణలో 75 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ 95 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ప్రస్తుతం టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత ఏమైనా కలెక్షన్లు పుంజుకొంటాయో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X