Adipurush Advance Collections రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ సంచలన రికార్డు..ప్రభాస్ మూవీ ఫస్ట్ డే టార్గెట్ ఎంతంటే?

వాల్మీకి రామాయణం గ్రంథం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో రూపొందిన ఆదిపురుష్ చిత్రం విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతున్నది. రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ కృతిసనన్ సీతారాములుగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతున్నది. టీ సీరిస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఓం రావత్ నిర్మించిన ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయంటే..

ఇండియాలో అన్ని ప్రాంతాల్లో ఆదిపురుష్ సినిమాకు భారీ ఆదరణ లభిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే హిందీ మార్కెట్‌లో 70 వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడుపోయాయి. హిందీ సినిమా చరిత్రలో ఈ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్‌కు స్పందన లభించడం అరుదైన విషయమని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Adipurush advance booking Collections worldwide

ఇక ఆంధ్ర ప్రదేశ్, నైజాంలో ఆదిపురుష్ సినిమాకు భారీ ఆదరణ లభిస్తున్నది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. కేవలం ఒకే రోజులో తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అమెరికా, ఇతర దేశాల్లో ఆదిపురుష్‌కు కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే రెండు హాలీవుడ్ సినిమాలు స్పైడర్ మ్యాన్, ట్రాన్స్‌ఫార్మర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉన్నాయి. జూన్ 16వ తేదీన ది ఫ్లాష్, మరో హాలీవుడ్ సినిమా రిలీజ్ కానున్నది. దాంతో ఈ సినిమాకు స్క్రీన్లు దొరకడం కష్టంగా మారింది. ఈ సమస్య కారణంగా ఆదిపురుష్ ఓవర్సీస్ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అమెరికాలో ఆదిపురుష్ ప్రీమియర్లు, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను 310 లొకేషన్లలో 850 షోలను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు 500K డాలర్లు వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో 4 కోట్లకుపైగా వసూళ్లను ఈ చిత్రం సాధించింది. ఇంకా ఒక రోజు ఉంది కాబట్టి.. 1 మిలియన్ డాలర్‌కు చేరువయ్యే అవకాశం ఉంది.

Adipurush advance booking Collections worldwide

ఆదిపురుష్ చిత్రం యూకేలో కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్‌ను నమోదు చేసింది. ఈ సినిమాను 18 లొకేషన్లలో 70 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అడ్వాన్స్ బుకింగ్‌ రూపంలో ఈ సినిమాకు సంబంధించిన 7000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఆస్ట్రేలియాలో 75 లొకేషన్లలో 238 షోల కోసం 6700 టికెట్లకుపైగా అమ్ముడుపోయాయి.

ఇక ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్‌కు వస్తున్న కలెక్షన్ల జోరును చూస్తే.. ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు, రాష్ట్రాలు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కలిపితే ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు తిరగరాసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తొలి రోజున 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X