Adipurush Advance Booking Collections ఓవర్సీస్‌లో ఆదిపురుష్‌కు ఊహించని క్రేజ్.. ప్రభాస్ రచ్చ మాములుగా లేదుగా!

ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ జంటగా ఓం రావత్ దర్శకత్వంలో టీ సీరిస్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. రామాయణ వాల్మికీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, ఓం రావత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్‌ను నమోదు చేస్తున్నది. ఆదిపురుష్ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఏ రేంజ్‌లో జరుగుతున్నదంటే?

ఆదిపురుష్ మూవీని ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో రూపొందించారు. ఈ సినిమాను 500 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఈ సినిమా కోసం అత్యాధునిక గ్రాఫిక్, కంప్యూటర్ టెక్నాలజీని, సౌండ్ డిజైన్‌ను సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు భారీ రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

Adipurush day 1 advance booking collections worldwide: Prabhas rocking at Overseas box office

ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలోని తిరుపతిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుక కోసం తిరుపతిలో అయోధ్య నగరానికి సంబంధించిన సెట్టింగ్‌ను భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈవెంట్ పనులు వేగం అందుకొన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

ఇదిలా ఉండగా, ఆదిపురుష్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో మొదలైంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించగా మంచి రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఆస్ట్రేలియాలో మంచి ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఈ సినిమా తొలి రోజు కోసం మెల్‌బోర్న్‌‌లోని ఐమాక్స్ థియేటర్‌లో సింగిల్ షో కోసం 10 వేల డాలర్లు వసూలు అయ్యాయి.

Adipurush day 1 advance booking collections worldwide: Prabhas rocking at Overseas box office

ఇక అమెరికాలో ఆదిపురుష్ ప్రీమియర్లు, తొలి రోజు కోసం అడ్వాన్స్ బుకింగ్ ఘనంగా మొదలైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమాను అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 110 లోకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఇప్పటి వరకు 294 షోల కోసం 3200 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 80K డాలర్లను వసూలు చేసింది.

అమెరికాలో ఆదిపురుష్ సినిమాను 3డీ, 2డీ ఫార్మాట్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా3డీ వెర్షన్‌ను తొలి రోజు 46 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 3డీ వెర్సన్ 30K డాలర్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. 2డీ వెర్షన్ 50K డాలర్లను వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X