Adipurush Collections ఆదిపురుష్‌కు రికార్డు వసూళ్లు.. ప్రభాస్ బాక్సాఫీస్ సునామీ.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఆదిపురుష్ చిత్రం అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. వాల్మీకి రామాయణం గ్రంధం ఆధారంగా ఈ సినిమాను మాడర్న్ లుక్, హై టెక్నాలజీ, గ్రాఫిక్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్, ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ రూపొందించిన ఈ సినిమా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, తొలి రోజు అంచనా వివరాల్లోకి వెళితే...
ఆదిపురుష్ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాకు సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ సినిమాకు భారీ డిమాండ్, క్రేజ్ ఏర్పడటంతో దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాను 7500 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారని తెలిసింది.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకు భారీగా ఓపెన్సింగ్స్ నమోదయ్యాయి. నేషనల్ చైన్ థియేటర్స్‌లో 1.40 లక్షల టికెట్లు, ఐనాక్స్‌లో 90 వేలకుపైగా టికెట్లు, సినీ పొలీస్‌లో 60 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి నేషనల్ చైన్ మార్కెట్‌లో 2.85 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.
అయితే ప్రభాస్ మూవీకి ఓవరాల్‌గా చూసుకొంటే రికార్డు అడ్వాన్స్ బుకింగ్ దక్కలేదు. బాహుబలి 6.5 లక్షల టికెట్లు అమ్మితే.. పఠాన్ చిత్రం 5.56 లక్షల టికెట్లు, కేజీఎఫ్ 2 మూవీ 5.05 లక్షలు, బ్రహ్మాస్త్రం 3.02 టికెట్లను అమ్మాయి. అయితే ఆదిపురుష్ మూవీ ఆ రేంజ్ టికెట్ల అమ్మకాలను రాబట్టలేకపోయింది.

ఇక ఆదిపురుష్ సినిమాకు తొలి రోజు బ్రహ్మండమైన ఆక్యుపెన్సీ లభించింది. ఈ సినిమా రిలీజైన ప్రతీ చోట మంచి రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ చిత్రం తొలి రొజున ఇండియాలో 100 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 120 కోట్ల నుంచి 140 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











