Adipurush Day 2 Collections ఆదిపురుష్ కలెక్షన్ల వర్షం.. 250 కోట్లకు చేరువగా ప్రభాస్ మూవీ

ఆదిపురుష్ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్నది. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో టీ సీరిస్ అధినేతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం రిలీజైన ప్రతీ చోట కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేస్తున్నది. అయితే ఆదిపురుష్ 2వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

ఆదిపురుష్ చిత్రం సుమారు 500 కోట్ల రూపాయలతో టీ సిరీస్ నిర్మాతలు తెరకెక్కించారు. ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. దక్షిణాది థియేట్రికల్ హక్కులను 185 కోట్ల రూపాయలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బిజినెస్ చేసింది. హిందీలో సొంతంగా టీ సిరీస్ రిలీజ్ చేసింది.

Adipurush Day 2

ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది. ఏపీ, నైజాంలో 1100 స్క్రీన్లలో, కర్ణాటకలో 180 స్క్రీన్లలో, తమిళనాడులో 170 స్క్రీన్లలో, కేరళలో 150 స్క్రీన్లలో కలిపి ఇండియాలో 4000 స్క్రీన్లలో రిలీజైంది. ఇక ఓవర్సీస్‌లో 2100 స్క్రీన్లలో రిలీజైంది. దాంతో దాదాపు 8000 స్క్రీన్లలో రిలీజైంది.

Adipurush Day 2

ఆదిపురుష్ రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపించింది. క్రిటిక్స్ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ..రెండో రోజు స్టడీగా కనిపించింది. ఆక్యుపెన్సీ కూడా స్ట్రాంగ్‌గా కనిపించింది. మార్నింగ్ షోకు 40 శాతం, మధ్యాహ్నం 60 శాతం, ఫస్ట్ షోకు 70 శాతం, సెకండ్ షోకు 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Adipurush Day 2

ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను తొలి రోజు సాధించింది. నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఫస్ట్ డే 140 కోట్లు వసూళ్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. ఇండియాలో మొత్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. హిందీ వెర్షన్ 37 కోట్లకుపైగా, తెలుగులో 60 కోట్లకుపైగా, మలయాళంలో 40 లక్షలు, తమిళంలో 70 లక్షలు, కర్ణాటకలో 40 లక్షలు రాబట్టింది. ఓవర్సీస్‌లో 25 కోట్లు వసూలు చేసింది.

ఆదిపురుష్ రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియా వైడ్ సుమారు 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. రెండో రోజు కూడా 100 వరకు కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 250 కోట్లకు చేరువైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X