Adipurush Day 3 Collections ఆదిపురుష్ బాక్సాఫీస్ జైత్రయాత్ర.. 400 కోట్లకు చేరువగా ప్రభాస్ మూవీ

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నది. ఆదిపురుష్ చిత్రం విడుదలైన తొలి రోజే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. తొలి రోజే 140 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోష్‌ను కొనసాగించింది. కృతి సనన్ నటించిన ఈ చిత్రం ఇక మూడో రోజు కూడా వసూళ్ల సునామీని సృష్టించింది. ఓం రావత్ దర్శకత్వంలో టీ సిరీస్ అధినేతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం 3 రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే.

వీఎఫ్ఎక్స్, 3డీ టెక్నాలజీతో రూపొందిన ఆదిపురుష్ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాను సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా హక్కులు తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లకు అమ్ముడుపోయింది. కర్ణాటక థియేట్రికల్ హక్కులు 16.5 కోట్లు, తమిళనాడులో 5 కోట్లు, హిందీ థియేట్రికల్ హక్కులు 75 కోట్ల రూపాయలకు, కేరళ హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ హక్కులు 22 కోట్ల రూపాయలకు అమ్మారు. దాంతో ఈ సినిమా బిజినెస్ 240 కోట్ల మేర జరిగింది.

Adipurush Day 3 Collections worldwide: Prabhas movie near to 250 crores club

ఆదిపురుస్ చిత్రం తొలి రోజు రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు 140 కోట్లు వసూలు చేసింది. హిందీలో 37 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే..హిందీలో 38 కోట్ల రూపాయలు, తెలుగులో 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబ్టింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు కూడా 100 కోట్లు వసూలు చేసింది.

ఇక మూడో రోజు ఆదిపురుష్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. హిందీలో 40 కోట్ల రూపాయలను, ఇండియావైడ్ 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 110 కోట్లకుపైగా వసూళ్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 350 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. త్వరలోనే ఈ చిత్రం 500 కోట్ల మార్కును చేరే అవకాశం ఉంది.

Adipurush Day 3 Collections worldwide: Prabhas movie near to 250 crores club

ఆదిపురుష్ సినిమా కలెక్షన్లు ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల నికర వసూళ్లు సాధించింది. తమిళనాడులో 83 లక్షలు, కర్ణాటకలో 62 లక్షలు, కన్నడలో 50 లక్షల రూపాయలను వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఇండియాలోనే ఈ చిత్రం 250 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఆదిపురుష్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం ఈ చిత్రం 550 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సింది. ఇప్పటికే ఈ సినిమా 350 కోట్ల వసూళ్లను వసూళ్లు నమోదు చేసింది. తొలివారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X