Adipurush Day 4 Collections ఆగని ఆదిపురుష్ మూవీ కలెక్షన్ల జోరు.. 400 కోట్ల క్లబ్‌లోకి ప్రభాస్ మూవీ
ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. వివాదాలను, నిరసనలను, కోర్టు కేసులు, నిషేధపు డిమాండ్లను ఎదురిస్తూ రికార్డు కలెక్షన్లను సాధిస్తున్నది. గత మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం నాలుగో రోజు వసూళ్ల దూకుడును కాస్త తగ్గించింది. ఆదిపురుష్ 4వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
ఆదిపురుష్ చిత్రం ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ చిత్రం 90 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రెండో రోజు ఈ చిత్రం 66 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజు ఆదివారం 70 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 220 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

ఆదిపురుష్ చిత్రం వివిధ భాషల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీలో ఈ చిత్రం తొలి రోజు 40 కోట్ల మేర, రెండో రోజు 27 కోట్లకుపైగా, మూడో రోజు 40 కోట్ల మేర వసూళ్లను సాధించింది.దాంతో ఈ చిత్రం హిందీలోనే 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో అంటే 2023 లో విడుదలైన చిత్రాల్లో టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.
ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. తెలుగులో తొలి రోజు 60 కోట్ల కలెక్షన్లు, రెండో రోజు 27 కోట్ల కలెక్షన్లు, మూడో రోజు 30 కోట్ల కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ చిత్రం తెలుగులో కూడా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మలయాళంలో మూడు రోజుల్లో 1 కోటి రూపాయలు, తమిళంలో 2.5 కోట్లు, కన్నడలో 1.5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 220 కోట్ల నికరంగా, 260 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 80 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
ఇక ఆదిపురుష్ సినిమా నాలుగో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 25 నుంచి 30 కోట్ల కలెక్షన్లు, ఓవర్సీస్‌లో 5 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 30 నుంచి 35 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా త్వరలోనే 400 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో చేరేందుకు మార్గం సుగమమైంది.


Click it and Unblock the Notifications











