Adipurush Collections భారీగా పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్లు.. లాభాల్లోకి రావాలంటే ఇంకెంత?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం తొలి వారాంతంలో భారీ కలెక్షన్లను సాధించింది. అయితే తొలివారంలో సోమవారం తర్వాత ఈ సినిమా కలెక్షన్లు ఆశించినంత స్థాయిలో కనిపించడం లేదు. వివాదాలు, నిషేధ ప్రకటనలు, నిరసనలు ఈ సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపించినట్టు కనిపిస్తున్నది. ఓం రావత్ దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మించిన ఈ చిత్రం 5వ రోజు ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

ఆదిపురుష్ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లు, రెండో రోజు 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు కూడా మరో 100 కోట్లు వసూలు చేసి తొలివారాంతంలో 340 కోట్ల రూపాయల భారీ వసూళ్లను నమోదు చేసింది. ఇక నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లు వసూలు చేయడంతో ఈ చిత్రం 375 కోట్ల రూపాయలను రాబట్టింది.

Adipurush Day 5 official Collections worldwide: Prabhas movie dropped heavily at box office

తెలుగులో ఆదిపురుష్ చిత్రం భారీగానే వసూళ్లను రాబడుతున్నది ఈ చిత్రం తొలి రోజు 50 కోట్ల రూపాయలు, రెండో రోజు 40 కోట్లు, మూడో రోజు 30 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 7 కోట్ల రూపాయలు, వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం సుమారు 130 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సోమ, మంగళవారాల్లో నిలకడగా వసూళ్లను రాబట్టలేకపోయింది.

ఇక ఐదో రోజు ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆదిపురుష్ చిత్రం 15 కోట్ల రూపాయలను రాబట్టింది. హిందీలో 10 కోట్ల రూపాయలు, తెలుగులో 4.5 కోట్లు, తమిళంలో 35 లక్షలు రూపాయలు, కన్నడలో 16 లక్షలు రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో గత 5 రోజుల్లో 250 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

Adipurush Day 5 official Collections worldwide: Prabhas movie dropped heavily at box office

ఆదిపురుష్ చిత్రం 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఓ మోస్తారు కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 30 కోట్ల గ్రాస్, 15 కోట్ల షేర్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరేందుకు సిద్దమైంది.

ఆదిపురుష్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. హిందీలో 180 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్, 240 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X