Adipurush అక్కడ ఆదిపురుష్‌కు ఎదురుదెబ్బ.. ఆ నాలుగు సినిమాలతో పరిస్థితి కష్టంగా!
వివాదాలు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. తిరుపతిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో సినిమా రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లు భారీగా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ సినిమాకు ఎదురు దెబ్బ తాకే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సినిమాకు ప్రతికూలంగా మారిన విషయాల్లోకి వెళితే..
వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ క్రేజ్ నెలకొన్నది. ఇప్పటికే దుబాయ్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో రిలీజ్‌కు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. యూకేలో 12ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 12ఏ సర్టిఫికెట్ అంటే పిల్లలకు కూడా అనుమతి ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు.

ఇక యూకేలో ఆదిపురుష్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి 2500 టికెట్లు అమ్ముడుపోయాయి. అందులో 2260 టికెట్లు తెలుగు వెర్షన్, 220 టికెట్లు హిందీ వెర్షన్, 23 టికెట్లు తమిళ వెర్షన్‌కు అమ్ముడుపోయాయి. ఈ సినిమాను 16 లోకేషన్లలో 33 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆదిపురుష్ సినిమా రిలీజ్‌కు ఇంకా వారం రోజులు వ్యవధి ఉంది. ఈ సినిమాను అమెరికాలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఇప్పటికే 139 లోకేషన్లలో 360 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే ఈ సినిమా 160K డాలర్లు వసూలు చేసింది.
అయితే ఆదిపురుష్ సినిమాకు హాలీవుడ్ సినిమాల నుంచి భారీ దెబ్బ పడేలా కనిపిస్తున్నది. ఆదిపురుష్ సినిమా రిలీజ్ టైమ్‌లోనే ది ఫ్లాష్ అనే మూవీ భారీగా రిలీజ్ అవుతున్నది. అలాగే ఎలిమెంటల్ అనే సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నది. దాంతో ఆదిపురుష్ సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కడానికి కష్టంగా మారిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాల్లో బెన్ అఫ్లేక్ నటించిన ది ఫ్లాష్ చిత్రం జూన్ 16న రిలీజ్ అవుతున్నది. ఎలిమెంటల్ అనే మరో హాలీవుడ్ చిత్రం కూడా జూన్ 16 రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ మూవీ మూవీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్ సినిమా జూన్ 9న రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











