Adipurush 4 Days Collections: 4వ రోజూ ఢమాల్.. 40 నుంచి 11కు పతనం.. ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అంటే!
సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించి.. కొంత కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపించే చిత్రాలతో వస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లో 'ఆదిపురుష్' అనే సినిమాను చేశాడు. విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఇక, వర్కింగ్ డే అయిన నాలుగో రోజు షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' 4 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
టెక్నికల్ వండర్‌గా వచ్చింది:ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతం ఇచ్చారు.

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల మేర బిజినెస్ జరిగింది.
4వ రోజు తెలుగు వసూళ్లిలా:'ఆదిపురుష్' మూవీ 4వ రోజు ఏపీ, తెలంగాణలో భారీగా డౌన్ అయింది. ఫలితంగా నైజాంలో రూ. 2.23 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 60 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో.. రూ. 4.81 షేర్, రూ. 7.10 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

4 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:4 రోజులకు 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 32.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.90 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.16 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.66 కోట్లు, గుంటూరులో రూ. 6.11 కోట్లు, కృష్ణాలో రూ. 3.88 కోట్లు, నెల్లూరులో రూ. 1.91 కోట్లతో.. రూ. 69.76 కోట్లు షేర్, రూ. 110.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' మూవీకి 4 రోజులకు కలిపి తెలుగులో రూ. 69.76 కోట్లు, తమిళంలో రూ. 2.06 కోట్లు, కర్నాటకలో రూ. 10.81 కోట్లు, కేరళలో రూ. 72 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 59.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 20.90 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో రూ. 163.45 కోట్లు షేర్, రూ. 326.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 4 రోజుల్లో దీనికి రూ. 163.45 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 78.55 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

మరీ ఇంత దారుణంగానా?:'ఆదిపురుష్' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. కానీ, నాలుగో రోజు మాత్రం ఈ చిత్రం అన్ని ఏరియాల్లోనూ తేలిపోయింది. ముఖ్యంగా మూడో రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 42.10 కోట్లు షేర్ రాబట్టిన ఈ సినిమా.. నాలుగో రోజు మాత్రం దారుణంగా రూ. 11.85 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసి నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications











