Adipurush Overseas Report: హాలీవుడ్‌ మూవీకి షాక్.. ఒక్కరోజే అన్ని డాలర్లు.. భారత కరెన్సీలో ఎంతంటే!

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ఎన్నో ఏళ్ల పాటు హవాను చూపించి.. 'బాహుబలి' నుంచి బహుభాషా చిత్రాలతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలతో వచ్చిన అతడు.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే రామాయణం నేపథ్యంతో ఉన్న సినిమాను చేశాడు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఇది సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' ఓవర్సీస్ కలెక్షన్ల రిపోర్టును మీరే చూడండి!

శ్రీరాముడిగా ప్రభాస్ వచ్చేశాడు:తెలుగు స్టార్ హీరో ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో వచ్చిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతాన్ని అందించారు.

Adipurush Movie Premieres Plus Day 1 Overseas Official Collections

అక్కడి నుంచే అలాంటి టాక్:భారీ హైప్ క్రియేట్ చేసుకుని విడుదలైన 'ఆదిపురుష్' మూవీకి ఓవర్సీస్‌లోని ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే అంతగా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే ఫస్ట్ డేనే భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి.

ఇండియా వ్యాప్తంగా కోట్లలోనే:క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 32.84 కోట్లు షేర్, రూ. 50.90 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలకు కలిపి మరో రూ. 35 కోట్లు గ్రాస్ లభించింది. ఇలా ఫస్ట్ డేనే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయింది. దీంతో చాలా రికార్డును నమోదయ్యాయి.

Adipurush Movie Premieres Plus Day 1 Overseas Official Collections

హాలీవుడ్ మూవీకే షాకిచ్చేలా:రామాయణం నేపథ్యంతో ఓం రౌంత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ ముందుగానే స్టార్ట్ అయ్యాయి. అక్కడ హాలీవుడ్ చిత్రం 'ది ఫ్లాష్' కంటే ఎక్కువగానే ఈ సినిమాకు స్పందన లభించింది. ఫలితంగా యూఎస్‌లో ప్రీమియర్స్‌ ద్వారా ఈ సినిమాకు 825K డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ సమాచారం.

Adipurush Movie Premieres Plus Day 1 Overseas Official Collections

మొదటి రోజు అన్ని డాలర్లు:'ఆదిపురుష్' మూవీకి అమెరికాలో ప్రీమియర్స్ ద్వారానే 825K డాలర్స్ గ్రాస్ వసూలు అయింది. అలాగే, మొదటి రోజు కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. తద్వారా 680K డాలర్లను వసూలు చేసింది. ఇలా ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే యూఎస్‌లో 1.5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. భారత కరెన్సీలో అక్కడ రూ. 12.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Adipurush Movie Premieres Plus Day 1 Overseas Official Collections

మొత్తంగా అన్ని కోట్లతో రచ్చ:ఒక్క యూఎస్‌లోనే 'ఆదిపురుష్' మూవీ రూ. 12.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. అలాగే, ఈ చిత్రం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా ఎన్నో దేశాల్లోనూ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అక్కడ కూడా ఇది దాదాపు రూ. 12 కోట్లు వరకూ రాబట్టింది. అంటే ఓవర్సీస్ మొత్తంలో ఈ సినిమా ఏకంగా రూ. 24.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X