Adipurush Hindi Collections: రూపాయి ఖర్చు లేకుండానే వంద కోట్లు.. ప్రభాస్ దెబ్బకు వాళ్లంతా షాక్
గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలు దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నారు. తద్వారా వరుసగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలనే చేస్తున్నారు. అలాంటి వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ప్రతి సినిమాకూ తన స్టామినాను పెంచుకుంటూనే ఉంటోన్న అతడు.. ఇటీవలే 'ఆదిపురుష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అన్ని ప్రాంతాల్లోనూ విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హిందీలో ఓ అరుదైన ఘనతను ఈ చిత్రం అందుకుంది. ఆ సంగతులు మీకోసమే!
రాఘవుడిగా వచ్చిన ప్రభాస్: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కలిసి చేసిన సినిమానే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు.

అలాంటి టాక్‌తోనూ భారీగా: అదిరిపోయే అంచనాలతో విడుదలైన 'ఆదిపురుష్' మూవీకి ఓవర్సీస్‌లోని ప్రీమియర్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఎవరూ ఊహించని రీతిలో దీనికి రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. అదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ ఈ సినిమా వీకెండ్‌లో విశేషంగానే రాణించింది.
అక్కడ భారీగా.. రెస్పాన్స్: అదిరిపోయే కాంబినేషన్‌లో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కంటే బాలీవుడ్‌లో అత్యధిక థియేటర్లు లభించాయి. దీనికితోడు అక్కడ ముందుగానే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఫలితంగా ఈ సినిమాకు హిందీలోనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో అక్కడ ఓపెనింగ్ డేన ఏకంగా రూ. 35 కోట్లు వరకూ నెట్ కలెక్షన్లు కూడా వచ్చాయి.

మూడు రోజుల్లో వంద కోట్లు: రామాయణం నేపథ్యంతో ఓం రౌంత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీకి నార్త్ ఆడియెన్స్ అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు రూ. 35 కోట్లు, రెండో రోజు రూ. 35 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు నెట్‌ను వసూలు చేసింది. ఇలా కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా హిందీలో రూ. 110 కోట్లు రాబట్టింది.
ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్:
మన తెలుగు పరిశ్రమకు చెందిన హీరోలు బాలీవుడ్‌పై దండయాత్ర మొదలు పెట్టిన తర్వాత చాలా చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయ్యాయి. కానీ, వంద కోట్ల క్లబ్‌లో మాత్రం కొన్ని సినిమాలే చేరాయి. అందులో ప్రభాస్ నటించిన మూడు చిత్రాలు ఉండడం విశేషం. అందులో మొదటిది 'బాహుబలి 2' కాగా.. రెండోది 'సాహో'.. మూడో సినిమా 'ఆదిపురుష్'.

రూపాయి ఖర్చు లేకుండా: ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ వంద కోట్ల రూపాయలను సాధించడం పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ, ఈ సినిమాకు సంబంధించి నార్త్‌లో అస్సలు ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు. అంటే.. ప్రచారం కోసం నిర్మాతలు ఈవెంట్లు, ఇంటర్వ్యూల రూపంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అయినా వంద కోట్లు కొట్టి ప్రభాస్ అందరికీ షాక్ ఇచ్చేశాడు.


Click it and Unblock the Notifications











