Adipurush pre release business చరిత్ర సృష్టించిన ప్రభాస్ మూవీ బిజినెస్.. బాహుబలి, RRR కలెక్షన్లకు మించి..!

భారత పౌరాణిక చరిత్ర రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సీరిస్ నిర్మిస్తున్నది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ రెమ్యునరేషన్ వివరాలు:ఆదిపురుష్ సినిమా నిర్మాణ విషయంలోకి వెళితే..అంతా భారీగానే జరిగింది. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమా కోసం ప్రభాస్ సుమారు 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకొన్నట్టు తెలుస్తున్నది. రావణాసురుడిగా నటించిన సైఫ్ ఆలీఖాన్, సీతగా నటించిన కృతి సనన్ కూడా భారీ పారితోషికం అందుకొన్నట్టు సమాచారం.

Adipurush pre release business worldwide: Prabhas scores record level digital, Satellite and Theatrical business

తెలుగు థియేట్రికల్ రైట్స్:ఇక ఆదిపురుష్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. భారతీయ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ ధరకు పీపుల్స్ మీడియా దక్కించుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమా ఏపీ, నైజాం థియేట్రికల్ హక్కులు 180 కోట్ల రూపాయల మేర చెల్లించి సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

Adipurush pre release business worldwide: Prabhas scores record level digital, Satellite and Theatrical business

వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్:ఆదిపురుష్ తెలుగేతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే.. ఇంకా పూర్తి కాలేదని సమాచారం. హిందీ, ఓవర్సీస్‌కు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ గురించి చర్చలు జరుగుతున్నాయి. మిగితా భాషల హక్కులు 450 కోట్లు (తెలుగుతో కలిపి) మేర జరిగాయనేది ట్రేడ్ వర్గాల్లో టాక్. ఈ రేంజ్‌లో ఆది పురుష్ థియేట్రికల్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Adipurush pre release business worldwide: Prabhas scores record level digital, Satellite and Theatrical business

ఆదిపురుష్ నాన్ థియేట్రికల్ వివరాలు:ఆదిపురుష్ నాన్ థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే.. అవి కూడా భారీగానే నమోదయ్యయాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 500 కోట్ల రూపాయలు, శాటిలైట్ హక్కులు 400 కోట్ల రూపాయలు, మ్యూజిక్ రైట్స్ 60 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. నాన్ థియేట్రికల్ హక్కులు సుమారు 960 కోట్ల రూపాయల మేర జరిగినట్టు సమాచారం.

Adipurush pre release business worldwide: Prabhas scores record level digital, Satellite and Theatrical business

ఆదిపురుష్ ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్:ఆదిపురుష్ సినిమా ఓవరాల్ అంటే.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు జరిగినది 1300 కోట్ల రూపాయలు. హిందీ, ఓవర్సీస్ బిజినెస్ జరిగితే.. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ 1800 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగినది ఆదిపురుష్ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X