Don't Miss!
- News
తప్పిన పెను ప్రమాదం: శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన టీఎస్ఆర్టీసీ బస్సు
- Sports
Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
HIT 2: అడివి శేష్ గత సినిమాల బాక్సాఫీస్ రికార్డులు.. ఇప్పుడు హిట్టయితే మరో రికార్డ్!
టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇటీవల కాలంలో వరుసగా బాక్స్ ఆఫీస్ విజయాలతో దూసుకుపోతున్నాడు. అతను డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా అందిస్తూ తన మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నాడు. తప్పకుండా అతని సినిమాలో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది అని ప్రేక్షకుల్లో కూడా ఒక మంచి నమ్మకం అయితే ఏర్పడింది. అడవి శేష్ కూడా ప్రేక్షకులను ఎక్కడ బోర్ కొట్టించకుండా మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
ఒక విధంగా అతని సినిమాలకు రైటర్ గా కూడా తనే వర్క్ చేస్తూ ఉండటం విశేషం. ఇక ఈసారి హిట్ 2 సెకండ్ కేసు సినిమాతో కూడా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక అడివి శేష్ చివరి 4 సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలలోకి వెళితే ముందుగా క్షణం నుంచి అతనికి బాక్సాఫీస్ వద్ద రేంజ్ పెరుగుతూ వచ్చింది. ఆ సినిమా 11 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుని మంచి విజయాన్ని అందించింది. ఇక తర్వాత వచ్చిన మరో సస్పెన్స్ త్రిల్లర్ సినిమా కూడా అదే రేంజ్ లో 11 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుని అతని స్థాయిని పెంచేసింది.

ఇక తర్వాత వచ్చిన ఎవరు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా 11 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకంటూ వచ్చిన అడివి శేష్ మేజర్ సినిమాతో మాత్రం అంతకంటే ఎక్కువ స్థాయిలో ఏకంగా 34 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అందరికీ ఫోకస్ హిట్ సినిమాపై పడింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు సమాచారం. ఒక విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతనికి అత్యధిక టార్గెట్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసి భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఏకైక హీరోగా అడివి శేష్ కొత్త రికార్డును క్రియేట్ చేసినట్లే అని చెప్పవచ్చు.