HIT 2 Official Collections: సండే భారీ వసూళ్లు.. అడివి శేష్ మరో రికార్డు.. నాని అన్ని కోట్ల లాభాలు

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ స్టేటస్‌కు చేరువ అవుతున్నారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు అడివి శేష్ ఒకడు. ఆరంభం నుంచీ ప్రత్యేకతను చాటుకుంటోన్న అతడు వరుస హిట్లతో దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు శేష్ 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ 'హిట్ 2' మూవీ 10 రోజుల రిపోర్టును మీరే చూడండి!

కేడీగా మారిపోయిన అడివి శేష్

కేడీగా మారిపోయిన అడివి శేష్


అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. విశ్వక్ నటించిన 'హిట్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు.

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు


అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కలిపి ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

10వ రోజు తెలుగులో వసూళ్లు

10వ రోజు తెలుగులో వసూళ్లు

'హిట్ 2' మూవీకి 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 52 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ వచ్చింది.

10 రోజుల్లో ఎంత వచ్చింది?

10 రోజుల్లో ఎంత వచ్చింది?

10 రోజుల్లో 'హిట్ 2' మూవీకి భారీగా వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.80 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 89 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, గుంటూరులో రూ. 92లక్షలు, కృష్ణాలో రూ. 84 లక్షలు, నెల్లూరులో రూ. 52 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 13.84 కోట్లు షేర్, రూ. 23.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా


ఏపీ, తెలంగాణలో 10 రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 13.84 కోట్లు రాబట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 20.39 కోట్లు షేర్‌, రూ. 37.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?

అడివి శేష్ - శైలేష్ కొలను కాంబోలో వచ్చిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 20.39 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 5.39 కోట్లు లాభాలు దక్కాయి.

అడివి శేష్ మరో రికార్డు కూడా

అడివి శేష్ మరో రికార్డు కూడా


క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో ఈ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం రూ. 20 కోట్ల షేర్ మార్కును చేరుకుంది. అదే సమయంలో లాభాల విషయంలోనూ ఇది రూ. 5 కోట్ల మార్కును దాటిసి రికార్డు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X