HIT 2 Official Collections: అడివి శేష్ సంచలన రికార్డు.. వంద కోట్లతో అరాచకం.. హిట్ లాభం ఎంతంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతో మంది హీరోలు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటోన్నారు. ఇలా డీసెంట్ హిట్లను ఖాతాలో వేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అడివి శేష్‌దే. కెరీర్ ఆరంభం నుంచీ విభిన్నమైన చిత్రాలను చేస్తూ సత్ఫలితాలను రాబడుతోన్న అతడు.. ఇటీవలే 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి భారీ కలెక్షన్లు వచ్చి బిగ్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'హిట్ 2' మూవీ 11 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాడు
టాలెంటెడ్ గాయ్ అడివి శేష్ హీరోగా నటించిన సినిమానే 'హిట్: ది సెకెండ్ కేస్'. విశ్వక్ నటించిన 'హిట్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు భాగం అయ్యారు.

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు
అడివి శేష్ హీరోగా చేసిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 11.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కలిపి ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

11వ రోజు తెలుగులో వసూళ్లు
11వ రోజు 'హిట్ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 80 వేలు, నెల్లూరులో రూ. 20 వేలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వచ్చింది.

11 రోజుల్లో ఎంత వచ్చింది?
'హిట్ 2' మూవీకి 11 రోజుల్లో భారీగా వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.91 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.83 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు, గుంటూరులో రూ. 93 లక్షలు, కృష్ణాలో రూ. 85 లక్షలు, నెల్లూరులో రూ. 52 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 14.04 కోట్లు షేర్, రూ. 23.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
11 రోజుల్లోనే ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 14.04 కోట్లు రాబట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.38 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 20.72 కోట్లు షేర్, రూ. 37.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?
అడివి శేష్ హీరోగా నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 20.72 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 5.72 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

వంద కోట్లతో సంచలనంగా
అడివి శేష్ ఈ ఏడాది ఆరంభంలో 'మేజర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి రూ. 65 కోట్లకు పైగా గ్రాస్ లభించింది. ఇప్పుడు అతడు 'హిట్ 2' మూవీతో వచ్చాడు. ఈ చిత్రం రూ. 37 కోట్లకు పైగా గ్రాస్ దక్కింది. ఇలా ఈ రెండు సినిమాలతో రూ. 100 కోట్లు సాధించాడు. తద్వారా ఈ ఘనత అందుకున్న యంగ్ హీరోగా టాలీవుడ్‌లో శేష్ రికార్డు సాధించాడు.


Click it and Unblock the Notifications











