HIT 2 Official Collections: అడివి శేష్ ఊరమాస్.. 2 రోజుల్లోనే సంచలన వసూళ్లు.. అన్ని కోట్లతో రికార్డు
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ హీరో అడివి శేష్. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ యంగ్ హీరో 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి టాక్‌తో పాటు కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'హిట్ 2' రెండు రోజుల రిపోర్టును మీరే చూడండి!

రెండో కేసు కోసం శేష్ ఎంటర్
విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు
అడివి శేష్ హీరోగా చేసిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాలను కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

2వ రోజు తెలుగులో వసూళ్లు
'హిట్ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజూ భారీ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.74 కోట్లు, సీడెడ్‌లో రూ. 36 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.28 కోట్లు షేర్, రూ. 5.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

2వ రోజుల్లో ఎంత వచ్చింది?
'హిట్ 2' మూవీకి రెండు రోజుల్లో మంచి వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 74 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 95 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 49 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 7.31 కోట్లు షేర్, రూ. 11.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
2 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 7.31 కోట్లు కొల్లగొట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 10.96 కోట్లు షేర్, రూ. 19.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలి?
అడివి శేష్ - శైలేష్ కొలను కలయికలో రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 10.96 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ 4.04 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

అక్కడ అదిరిపోయే రికార్డు
టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. దీనికి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఇది అప్పుడే 666,641 డాలర్లను సాధించింది. తద్వారా ఇండియన్ కరెన్సీలో రూ. 5.42 కోట్లు గ్రాస్‌ను అందుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఊపు చూస్తుంటే సండే పూర్తయ్యే సరికి 1 మిలియన్ మార్కు చేరే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











