Don't Miss!
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
HIT 2 Official Collections: శేష్ సంచలన రికార్డు.. 4 రోజుల్లోనే అన్ని కోట్లు ఉఫ్.. RRR, KGF జాబితాలో!
టాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోలు వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నారు. అందులో కొందరు మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో విలక్షణ హీరో అడివి శేష్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ విభిన్నమైన చిత్రాలను చేస్తోన్న అతడు.. వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ యంగ్ హీరో 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీకి నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో చూడండి!
రెండో కేసు కోసం వచ్చిన శేష్
క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'హిట్' మూవీ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా 'హిట్: ది సెకెండ్ కేస్'ను తీశారు. అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేసింది. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు.
బెడ్‌పై రెచ్చిపోయిన డింపుల్: ఆ యాంగిల్లో పడుకుని ఎద అందాల విందు
హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు
అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాలను కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.
4వ రోజు తెలుగులో వసూళ్లు
'హిట్ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజూ వసూళ్లు తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 46 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 90 లక్షలు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ వచ్చింది.
లేలేత అందాలతో రెచ్చగొడుతోన్న దీప్తి సునైనా: తొలిసారి ఆ పార్ట్స్ చూపిస్తూ!
4 రోజుల్లో ఎంత వచ్చింది?
'హిట్ 2' మూవీకి నాలుగు రోజుల్లో మంచి వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.52 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 74 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 11.41 కోట్లు షేర్, రూ. 18.75 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
4 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 11.41 కోట్లు కొల్లగొట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.45 కోట్లు, ఓవర్సీస్లో రూ. 3.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 16.21 కోట్లు షేర్, రూ. 28.70 కోట్లు గ్రాస్ వచ్చింది.
Bigg Boss Elimination: తొలిరోజే ఓటింగ్‌లో సెన్సేషన్.. ఇనాయాకు షాక్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు!
బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?
అడివి శేష్ - మీనాక్షి కలయికలో రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 16.21 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 1.21 కోట్లు లాభాలు దక్కాయి.
20వ హిట్.. అడివి శేష్ రికార్డ్
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హిట్: ది సెకెండ్ కేస్' భారీ కలెక్షన్లతో సత్తా చాటుతోంది. దీంతో నాలుగో రోజే ఈ సినిమా టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. దీంతో ఈ ఏడాది తెలుగులో 20వ విజయవంతమైన చిత్రంగా 'హిట్ 2' ఘనతను అందుకుంది. అలాగే, ఒకే ఏడాది రెండు హిట్లు (మేజర్, హిట్ 2) కొట్టిన హీరోగా అడివి శేష్ రికార్డు సాధించాడు.