HIT 2 Official Collections: ఒక్కసారిగా కలెక్షన్లు డౌన్.. శేష్ మరో రికార్డు.. నానికి లాభం ఎంతంటే!
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిన హీరో అడివి శేష్. విలక్షణమైన నటనతో విభిన్నమైన చిత్రాలు చేస్తూ సత్తా చాటుతోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో అడివి శేష్ 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీకి 5 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

సెకెండ్ కేస్ టేకప్ చేసిన శేష్
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్‌లో అడివి శేష్ హీరోగా నటించిన చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. గతంలో వచ్చిన 'హిట్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని దీన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది.

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు
అడివి శేష్ - నాని కాంబోలో వచ్చిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాలను కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల టాక్.

5వ రోజు తెలుగులో వసూళ్లు
'హిట్ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజూ వసూళ్లు తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 62 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజుల్లో ఎంత వచ్చింది?
'హిట్ 2' మూవీకి ఐదు రోజుల్లో మంచి వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 78 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 78 లక్షలు, కృష్ణాలో రూ. 72 లక్షలు, నెల్లూరులో రూ. 46 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 12.03 కోట్లు షేర్, రూ. 19.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 12.03 కోట్లు కొల్లగొట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 17.28 కోట్లు షేర్, రూ. 30.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?
అడివి శేష్ - శైలేష్ కొలను కాంబోలో వచ్చిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 17.28 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 2.28 కోట్లు లాభాలు దక్కాయి.

శేష్ ఖాతాలో మరో రికార్డు
క్రేజీ కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఈ మూవీ భారీ కలెక్షన్లతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం రూ. 30 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది. తద్వారా ఒకే ఏడాది ఈ ఘనతను రెండుసార్లు అందుకున్న హీరోగా అడివి శేష్ రికార్డు సాధించాడు.


Click it and Unblock the Notifications











