HIT 2 Official Collections: 6వ రోజు బిగ్ షాక్.. తొలిసారి ఇంత తక్కువగా.. మరో 2 లక్షలు వస్తే రికార్డు

సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు అడివి శేష్. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. ఈ ఏడాది ఆరంభంలోనే 'మేజర్'తో భారీ హిట్ కొట్టాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు అడివి శేష్ 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'హిట్ 2' సినిమా 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

సెకెండ్ కేస్ కోసం శేష్ ఎంట్రీ

సెకెండ్ కేస్ కోసం శేష్ ఎంట్రీ

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో అడివి శేష్ హీరోగా వచ్చిన క్రేజీ మూవీనే 'హిట్: ది సెకెండ్ కేస్'. విశ్వక్ సేన్ నటించిన 'హిట్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని దీన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు

అడివి శేష్ - శేలేష్ కలయికలో వచ్చిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాలను కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడైనట్లు తెలిసింది.

6వ రోజు తెలుగులో వసూళ్లు

6వ రోజు తెలుగులో వసూళ్లు

'హిట్ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజూ వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 40 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వచ్చింది.

6 రోజుల్లో ఎంత వచ్చింది?

6 రోజుల్లో ఎంత వచ్చింది?

'హిట్ 2' మూవీకి ఆరు రోజుల్లో మంచి వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 81 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 54 లక్షలు, గుంటూరులో రూ. 81 లక్షలు, కృష్ణాలో రూ. 74 లక్షలు, నెల్లూరులో రూ. 47 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 12.43 కోట్లు షేర్, రూ. 20.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ఏపీ, తెలంగాణలో 6 రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 12.43 కోట్లు కొల్లగొట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.75 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 17.98 కోట్లు షేర్‌, రూ. 32.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?

క్రేజీ గాయ్ అడివి శేష్ -మీనాక్షి జంటగా నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 17.98 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 2.98 కోట్లు లాభాలు వచ్చాయి.

మరో 2 లక్షలు వస్తే రికార్డు

మరో 2 లక్షలు వస్తే రికార్డు

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఈ మూవీ భారీ కలెక్షన్లతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది. అలాగే, మరో రూ. 2 లక్షలు వస్తే 3 కోట్ల లాభాల మార్కును చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X