twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

HIT 2 Official Collections: మరింత తగ్గిన వసూళ్లు.. నానికి మాత్రం లాభాల పంట.. మరో 1.12 కోట్లు వస్తే!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోలు వరుస సినిమాలతో సందడి చేస్తోన్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును దక్కించుకుని మన్ననలు అందుకుంటోన్నారు. అలాంటి వారిలో అడివి శేష్ ఒకడు. బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి బడా హీరోగా ఎదుగుతోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

సెకెండ్ కేస్ కోసం వచ్చేశాడు

సెకెండ్ కేస్ కోసం వచ్చేశాడు

ఇన్వెస్టిగేటీవ్ క్రైమ్ థ్రిల్లర్‌ జోనర్‌లో అడివి శేష్ హీరోగా నటించిన చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. విశ్వక్ నటించిన 'హిట్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని దీన్ని నిర్మించారు. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.

ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!
ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు

యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, మిగిలిన ప్రాంతాలను కలిపి ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

8వ రోజు తెలుగులో వసూళ్లు

8వ రోజు తెలుగులో వసూళ్లు

'హిట్ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజూ వసూళ్లు మరింత పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 26 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వచ్చింది.

Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన వాసంతి.. సంచలనంగా మారిన వీడియో.. ప్రేమలో బిగ్ బాస్ కొత్త జంట!
Bigg Boss: అతడికి ముద్దు పెట్టిన వాసంతి.. సంచలనంగా మారిన వీడియో.. ప్రేమలో బిగ్ బాస్ కొత్త జంట!

8 రోజుల్లో ఎంత వచ్చింది?

8 రోజుల్లో ఎంత వచ్చింది?

'హిట్ 2' మూవీకి 8 రోజుల్లో మంచి వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.39 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.69 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, గుంటూరులో రూ. 85 లక్షలు, కృష్ణాలో రూ. 78 లక్షలు, నెల్లూరులో రూ. 49 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 12.93 కోట్లు షేర్, రూ. 21.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ఏపీ, తెలంగాణలో ఎనిమిది రోజుల్లోనే భారీ స్థాయిలో రూ. 12.93 కోట్లు కొల్లగొట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.95 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 18.88 కోట్లు షేర్‌, రూ. 34.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!
బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?

అడివి శేష్ - శైలేష్ కలయికలో నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 18.88 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 3.88 కోట్లు లాభాలు వచ్చాయి.

మరో రూ. 1.12 కోట్లు రాబడితే

మరో రూ. 1.12 కోట్లు రాబడితే

క్రైమ థ్రిల్లర్‌ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో ఈ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇక, ఈ మూవీకి మరో రూ. 1.12 కోట్లు వసూలు అయితే ఈ చిత్రం రూ. 20 కోట్ల షేర్ క్లబ్‌లో చేరుతుంది. అలాగే, రూ. 4 కోట్ల లాభాల మార్కును కూడా దాటుతుంది.

English summary
Young Hero Adivi Sesh Did HIT The Second Case Movie Under Sailesh Kolanu Direction. This Movie Collects Rs 18.88 Crores in 8 Days.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X