HIT 2 Total Collections: శేష్ సంచలన రికార్డ్.. 15 కోట్లకు అమ్మితే భారీ వసూళ్లు.. నానికి కోట్ల లాభం
టాలీవుడ్‌లో ఉన్న అతి తక్కువ మంది టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ ఒకడు. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న ఈ యంగ్ హీరో.. ఇటీవలే 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి భారీ కలెక్షన్లు వచ్చి వారం రోజుల లోపే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసి భారీ లాభాలను అందుకుంది. ఈ నేపథ్యంలో 'హిట్ 2' మూవీ టోటల్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

పోలీస్‌గా ఎంట్రీ ఇచ్చిన శేష్
టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. విశ్వక్ నటించిన 'హిట్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు.

హిట్ 2 ప్రీ బిజినెస్ వివరాలు
వరుస విజయాల హీరో అడివి శేష్ నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 12.25 కోట్లు బిజినెస్ జరిగింది. అలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కలిపి ఈ సినిమా రూ. 14.25 కోట్లకు అమ్ముడుపోయింది.

పాజిటివ్ టాక్.. భారీ కలెక్షన్లు
మర్డర్ మిస్టరీ నేపథ్యంతో రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అదే ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ దీనికి కలెక్షన్లు సునామీ సృష్టించి సత్తా చాటుకుంది.

హిట్ 2 తెలుగు కలెక్షన్లు ఇలా
'హిట్ 2' మూవీకి ఫుల్ రన్‌లో భారీగా వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.01 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 67 లక్షలు, గుంటూరులో రూ. 1.06 కోట్లు, కృష్ణాలో రూ. 98 లక్షలు, నెల్లూరులో రూ. 57 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 15.54 కోట్లు షేర్, రూ. 26.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
ఏపీ, తెలంగాణలో ఫుల్ రన్‌లో భారీ స్థాయిలో రూ. 15.54 కోట్లు రాబట్టిన అడివి శేష్ 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.66 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.55 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే టోటల్‌గా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 22.75 కోట్లు షేర్, రూ. 42.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్‌కు ఎంతొచ్చింది?
అడివి శేష్ హీరోగా నాని నిర్మించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 22.75 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 7.75 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

శేష్ రికార్డు.. నాని మరో హిట్
అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన 'హిట్: ది సెకెండ్ కేస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో అత్యధిక కలెక్షన్లతో ఇది సూపర్ హిట్ అయింది. దీంతో అడివి శేష్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. దీంతో వరుస హిట్లతో అతడు రికార్డు నెలకొల్పాడు. అలాగే, నాని నిర్మాతగా మరో విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











