HIT 2: అడివి శేష్ నయా రికార్డు.. ఏకంగా అన్ని థియేటర్లతో అరాచకం
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా విభిన్నమైన సినిమాలు చేస్తూ తమదైన మార్కును చూపిస్తున్నారు. అందులో టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ ఒకడు. హీరోగా పరిచయమైనప్పటి నుంచి డిఫరెంట్ మూవీస్ చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'హిట్ ద సెకెండ్ కేస్' అనే క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రమే 'హిట్ ద సెకెండ్ కేస్'. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, గురువారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

'హిట్ ద సెకెండ్ కేస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ భారీ మొత్తంలో జరిగింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 210, సీడెడ్‌లో 90, ఆంధ్రాలో 245 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 550 నుంచి 600 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 85, ఓవర్సీస్‌లో 320 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 955 నుంచి 1000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'హిట్' సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది.


Click it and Unblock the Notifications











