twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Major 5 Days Collections: కలెక్షన్స్ లో భారీ డ్రాప్.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

    |

    అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' సినిమా ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగ్ర దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా ప్రకటించిన నాటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సందీప్ ఉన్నికృష్ణన్ ది కేరళ కావడంతో సినిమాను మలయాళంలో కూడా డబ్బింగ్ చెప్పించారు.

    సినిమాను హిందీ-తెలుగు బాషలలో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మూడో రోజే టార్గెట్ ఫినిష్ చేసిన 'మేజర్' ఐదో రోజు ఎంత కలెక్ట్ చేసింది అనేది బాక్స్ ఆఫీస్ రిపోర్టులో పరిశీలిద్దాం.

    మేజర్ క్రేజ్

    మేజర్ క్రేజ్

    అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తూ కధ అందించిన చిత్రం 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో లో రూపొందిన సినిమాలో అడివి శేష్ సరసన సయూ మంజ్రేకర్ హీరోయిన్‌ గా నటించగా శోభిత ధూళిపాళ్ల ఒక కీలక పాత్రలో నటించింది. ప్రకాష్ రాజ్, రేవతి అడివి శేష్ తల్లితండ్రుల పాత్రలలో నటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, మహేష్ బాబుకు జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించగా శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

    మంచి ప్రీ రిలీజ్ బిజినెస్

    మంచి ప్రీ రిలీజ్ బిజినెస్

    సినిమా ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమా మీద దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడుపోయింది. హిందీ వెర్షన్ ఒక్కటే రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలా మొత్తం చూసుకుంటే రూ. 18 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఈ సినిమాకి 19 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

     తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు

    తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు

    'మేజర్'కు ఏపీ, తెలంగాణలో 5వ రోజు మొదటి నాలుగు రోజులతో పోలిస్తే కలెక్షన్స్ తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 56 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ.8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.07 కోట్లు షేర్, రూ. 1.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

    5 రోజుల్లో

    5 రోజుల్లో

    ఆంధ్రా, తెలంగాణలో 'మేజర్' 5 రోజుల్లో మంచి కలెక్షన్స్ సాధించిందనే చెప్పాలి. ఈ క్రమంలో 5 రోజుల్లో నైజాంలో రూ. 6.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.68 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.13 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 74 లక్షలు, గుంటూరులో రూ. 89 లక్షలు, కృష్ణాలో రూ. 85 లక్షలు, నెల్లూరులో రూ. 57 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 13.66 కోట్లు షేర్, రూ. 22.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ఎన్ని కోట్ల లాభమంటే?

    ఎన్ని కోట్ల లాభమంటే?

    తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో రూ. 13.66 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.18 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 2.95 కోట్లు వచ్చాయి. అలా మొత్తం కలిపి 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 23.24 కోట్లు షేర్‌తో పాటు రూ. 42.50 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేయగా ప్రస్తుతానికి 4.24 కోట్ల లాభాలతో దూసుకు పోతోంది.

    English summary
    Tollywood Young Hero Adivi Sesh starrer major Movie Collect 23.24 Cr in 5 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X