Major Business: మేజర్‌కు ఊహించని బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్

టాలీవుడ్‌లో ప్రస్తుతం చాలా మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో సందడి చేస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును దక్కించుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ ఒకడు. విలన్ పాత్రలతో కెరీర్‌ను ఆరంభించిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆ తర్వాత సోలో హీరోగా మారాడు.

Recommended Video

Major Movie Review...Adivi Sesh కెరీర్ బెస్ట్ మూవీ #Tollywood | Filmibeat Telugu

అప్పటి నుంచి సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలో వరుస హిట్లను కొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'మేజర్' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

మేజర్‌గా మారిపోయిన అడివి శేష్

మేజర్‌గా మారిపోయిన అడివి శేష్

అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'మేజర్'. శశి కిరణ తిక్కా తెరకెక్కించిన ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను చేస్తోంది. ఇది జూన్ 3వ తేదీన విడుదల కాబోతుంది.

రియల్ హీరో స్టోరీ.. ఎమోషనల్‌గా

రియల్ హీరో స్టోరీ.. ఎమోషనల్‌గా

వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అడివి శేష్ ఇప్పుడు 'మేజర్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీన్ని ఎంతో ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కించారు. ఇప్పటికే వచ్చిన అప్‌డేట్ల వల్ల అది అర్థం అయింది.

వాయిదాలు.. రిలీజ్ డేట్ ఖరారు

వాయిదాలు.. రిలీజ్ డేట్ ఖరారు

భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో రూపొందిన 'మేజర్' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు డేట్లను కూడా ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇక, ఈ సినిమాను జూన్ 3న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

ప్రమోషన్స్ షురూ... ప్రివ్యూలతో

ప్రమోషన్స్ షురూ... ప్రివ్యూలతో

అడివి శేష్ నటించిన 'మేజర్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఈ మూవీకి సంబంధించిన ప్రివ్యూ షోలు కూడా దేశ వ్యాప్తంగా చాలా ఏరియాల్లో వేశారు. అన్ని చోట్లా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా

అడివి శేష్ నటించిన 'మేజర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 4.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా

ప్రపంచ వ్యాప్తంగా జరిగిందిలా

అడివి శేష్‌కు మార్కెట్ పెద్దగా లేకున్నా రియల్ స్టోరీ కావడంతో 'మేజర్' మూవీ కోసం పోటీ ఏర్పడింది. దీంతో ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 13 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 14 కోట్లుగా నమోదు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X