అడివి శేష్ వసూళ్లు.. రిలీజ్ కు ముందే 8 కోట్ల లాభం!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నటుడిగానే కాకుండా ముందుగానే రైటర్ గా ఆడియెన్స్ నుంచి నూటినూటి మార్కులు పొందారు. తన రైటింగ్ స్కిల్స్ తో పాటు యాక్టింగ్, యాక్షన్ స్కిల్స్ ను కూడా జత చేసి ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అడివి శేష్ నుంచి రాబోతున్న నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు అందింది.. ఆ వివరాల్లోకి వెళితే..

అడివి శేష్ నెక్ట్స్ సినిమా బడ్జెట్, ఇతర వివరాలు..
హిట్ 2తో భారీ సక్సెస్ ను అందుకున్న తర్వాత అడివి శేష్ నటిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టే 'డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రూ.70 కోట్ల వరకు ఈ సినిమాకు బడ్జెట్ వెచ్చించారని తెలుస్తోంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ తో పాటు భారీ తారాగణం ఉండటంతో సినిమాకు భారీగానే ఖర్చు అవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, హిందీలో ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావడానికి ఇంకాస్తా సమయం పట్టనుందని తెలుస్తోంది.

Adivi Sesh Next Movie Dacoit Music Right sold for Big Number Here is full Details

రికార్డ్ బ్రేకింగ్ ప్రైజ్ కు 'డెకాయిట్' మూవీ రైట్స్..
అడివి శేష్ సినిమాలకు సాధారణంగా డిమాండ్ ఉంటుంది. ఆయన ఎంపిక చేసుకునే కథల కారణంగా అడివి శేష్ సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ కారణంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ' చిత్రంపై భారీ హైప్స్ నెలకొన్నాయి. ఈ కారణంగా సినిమా రిలీజ్ కు ముందే బిజినెస్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆడియో రైట్స్ ను సోనీ మ్యూజిక్ రూ.8 కోట్లతో కొనుగోలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. అడివి శేష్ కెరీయర్ లోనే ఇది రికార్డ్ బ్రేకింగ్ ప్రైజ్ అని అంటున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడం విశేషం.

డెకాయిట్ మూవీ రిలీజ్ ఎప్పుడూ..
బైలింగ్వుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న డెకాయిట్ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రలో అలరించబోతున్నారు. రేపు మే 26న ఈ చిత్రం నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. గ్లింప్స్ తో పాటే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించ బోతున్నారని తెలుస్తోంది.

అడివి శేష్ తర్వాతి చిత్రాలు..
టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ కు గట్టి పాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. ఈ క్రమంలో అడవి శేష్ చిత్రాలకు మంచి కలెక్షన్లు కూడా వస్తుంటాయి. ఇక గతంలో వచ్చి గుఢాచారి చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. ఆ చిత్రానికి సీక్వెల్ గా G2ను కూడా తీసుకురాబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం మేకింగ్ దశలోనే ఉంటుంది. త్వరలో సినిమాపై మరిన్ని అప్డేట్స్ అందే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X