twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Major 10 Days Collections: మేజర్‌కు కలిసొచ్చిన సండే.. 10వ రోజు అన్ని కోట్లు.. మరో 83 లక్షలు వస్తే!

    |

    విలన్ పాత్రలతో కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా మారి.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ గాయ్ అడివి శేష్. విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో సత్తా చాటుతోన్న అతడు.. వరుస విజయాలతో దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరో 'మేజర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభం నుంచీ కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ 10 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లను చూద్దాం పదండి!

    మేజర్‌గా జీవించేసిన అడివి శేష్

    మేజర్‌గా జీవించేసిన అడివి శేష్

    అడివి శేష్ టైటిల్ రోల్‌లో శశి కిరణ తిక్కా రూపొందించిన బయోపిక్ మూవీనే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేయగా.. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు చేశారు.

    బ్రాతో హమీదా ఎద అందాల ఆరబోత: అబ్బో ఆమెను ఇలా చూశారంటే!బ్రాతో హమీదా ఎద అందాల ఆరబోత: అబ్బో ఆమెను ఇలా చూశారంటే!

    భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

    భారీ అంచనాలతో బిజినెస్ ఇలా


    సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో అడివి శేష్ హీరోగా చేసిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లకు స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడైంది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ అయింది. మొత్తంగా దీనికి రూ. 18 కోట్ల బిజినెస్ జరిగింది.

    10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    'మేజర్'కు ఏపీ, తెలంగాణలో 10వ రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 76 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    దీప్తి సునైనా హాట్ వీడియో వైరల్: బెడ్‌పై అలా చూపిస్తూ.. ఇది చూశారంటే!దీప్తి సునైనా హాట్ వీడియో వైరల్: బెడ్‌పై అలా చూపిస్తూ.. ఇది చూశారంటే!

    10 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?

    10 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?

    'మేజర్' 10 రోజుల్లోనూ రెండు రాష్ట్రాల్లో బాగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 7.83 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.37 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 88 లక్షలు, గుంటూరులో రూ. 1.10 కోట్లు, కృష్ణాలో రూ. 1.01 కోట్లు, నెల్లూరులో రూ. 65 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 16.67 కోట్లు షేర్, రూ. 27.75 కోట్లు గ్రాస్ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


    ఏపీ, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 16.67 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.95 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 4.70 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 29.17 కోట్లు షేర్‌తో పాటు రూ. 52.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

    టెలివిజన్ స్టార్‌తో యాంకర్ వర్షిణి నైట్ పార్టీ: గట్టిగా వాటేసుకుని.. ఏదో తేడాగా ఉందేంటబ్బా!టెలివిజన్ స్టార్‌తో యాంకర్ వర్షిణి నైట్ పార్టీ: గట్టిగా వాటేసుకుని.. ఏదో తేడాగా ఉందేంటబ్బా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


    ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'మేజర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 110 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లోనే అడివి శేష్ నటించిన ఈ సినిమాకు రూ. 29.17 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌‌తో పాటు ఇప్పటికే రూ. 10.17 కోట్ల లాభాలు కూడా వచ్చాయి.

    మరో 83 లక్షలు వస్తే శేష్ రికార్డు

    మరో 83 లక్షలు వస్తే శేష్ రికార్డు

    అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన 'మేజర్' మూవీ ఆరంభం నుంచే మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఫలితంగా ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అంతేకాదు, పది రోజుల్లోనే ఏకంగా రూ. 29.17 కోట్లు వసూలు చేసింది. అంటే.. మరో రూ. 83 లక్షలు వస్తే 30 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. ఇదే జరిగితే అడివి శేష్ రికార్డును క్రియేట్ చేసుకుంటాడు.

    English summary
    Tollywood Young Hero Adivi Sesh did Major Movie Under Sashi Kiran Tikka Direction. This Movie Collect 29.17 Cr in 10 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X