For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Major 13 Days Collections: మేజర్‌కు మరో భారీ దెబ్బ.. అయినా అన్ని కోట్ల లాభాలతో రికార్డు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు టాలెంటెడ్ హీరో అడివి శేష్. కెరీర్ ఆరంభం నుంచీ విభిన్నమైన సినిమాలతో సత్తా చాటుతోన్న అతడు.. హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరో ఇటీవలే 'మేజర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా దీనికి ఆరంభం నుంచీ కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం మరింత తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ 13 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లను చూద్దాం పదండి!

    మేజర్‌గా అడివి శేష్ విశ్వరూపం

    మేజర్‌గా అడివి శేష్ విశ్వరూపం

    అడివి శేష్ హీరోగా శశి కిరణ తిక్కా తెరకెక్కించిన బయోపిక్ మూవీనే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేయగా.. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు పోషించారు.

    డార్క్ రూమ్‌లో బ్రాతో పాయల్: ఈ ఫోజు చూసి తట్టుకోవడం కష్టమే

    భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

    భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

    అడివి శేష్ హీరోగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లకు స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడైంది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ అయింది. మొత్తంగా దీనికి రూ. 18 కోట్ల మేర బిజినెస్ అయింది.

    13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మేజర్' మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సత్తా చాటుకుంది. ఫలితంగా నాలుగు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో టార్గెట్‌ను చేరుకుంది. అయితే, ఈ వారం నుంచి వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 13వ రోజు మేజర్‌కు ఏపీ, తెలంగాణలో రూ. 12 లక్షలే వచ్చాయి.

    బ్రాతో పునర్నవి హాట్ సెల్ఫీ: నేను ఆ పని చేయడానికే వచ్చానా అంటూ!

    13 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?

    13 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?

    13 రోజుల్లోనూ 'మేజర్' రెండు రాష్ట్రాల్లో బాగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 8.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.09 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, గుంటూరులో రూ. 1.13 కోట్లు, కృష్ణాలో రూ. 1.05 కోట్లు, నెల్లూరులో రూ. 67 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.14 కోట్లు షేర్, రూ. 28.55 కోట్లు గ్రాస్ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    13 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 17.14 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.94 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.04 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 5.25కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 30.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 57.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

    టెలివిజన్ స్టార్‌తో యాంకర్ వర్షిణి నైట్ పార్టీ: గట్టిగా వాటేసుకుని.. ఏదో తేడాగా ఉందేంటబ్బా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'మేజర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 113 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లోనే అడివి శేష్ సినిమాకు రూ. 30.37 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌‌తో పాటు ఇప్పటికే రూ. 11.37 కోట్ల లాభాలు కూడా వచ్చాయి.

    English summary
    Tollywood Young Hero Adivi Sesh did Major Movie Under Sashi Kiran Tikka Direction. This Movie Collect 30.37 Cr in 13 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X