Major 15 Days Collections: మేజర్‌కు షాక్‌ మీద షాక్.. మహేశ్‌కు లాభం ఎన్ని కోట్లో తెలిస్తే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని తమ మార్కుతో దూసుకుపోతోన్నారు. అందులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఒకడు. విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో ఆరంభంలోనే మంచి పేరు సంపాదించుకున్న అతడు.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'మేజర్' అనే సినిమాతో శేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే, 15వ రోజు మాత్రం 'మేజర్'కు భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంతో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

 మేజర్‌గా జీవించేసిన అడివి శేష్

మేజర్‌గా జీవించేసిన అడివి శేష్

అడివి శేష్ - శశి కిరణ తిక్కా కలయికలో వచ్చిన చిత్రమే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేయగా.. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు పోషించారు.

భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

భారీ అంచనాలతో బిజినెస్ ఇలా


మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీతో వచ్చిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడైంది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ అయింది. మొత్తంగా దీనికి అన్ని ఏరియాలను కలిపి రూ. 18 కోట్ల మేర బిజినెస్ అయింది.

 15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?


క్రేజీ కాంబినేషన్‌లో ఎమోషనల్ బయోపిక్‌గా రూపొందిన 'మేజర్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 14వ రోజు కేవలం రూ. 7 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి. దాన్నే కంటిన్యూ చేస్తూ 15వ రోజు దీనికి రూ. 6 లక్షల షేర్ మాత్రమే వచ్చింది.

15 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?

15 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?


'మేజర్' 15 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో బాగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 8.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, గుంటూరులో రూ. 1.14 కోట్లు, కృష్ణాలో రూ. 1.07 కోట్లు, నెల్లూరులో రూ. 67 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.26 కోట్లు షేర్, రూ. 28.80 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఏపీ, తెలంగాణలో 15 రోజుల్లో రూ. 17.26 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.97 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.09 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 5.50 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 30.82 కోట్లు షేర్‌తో పాటు రూ. 57.98 కోట్లు గ్రాస్ వచ్చింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మేజర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 113 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో అడివి శేష్ సినిమాకు రూ. 30.82 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌‌తో పాటు ఇప్పటికే రూ. 11.82 కోట్ల లాభాలు కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X