Don't Miss!
- News
స్వల్ప భూకంపం.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. జనం పరుగులు
- Finance
Success Story: చిన్న వయస్సులోనే వ్యాపారంలోకి.. ప్రపంచంతో పోటీపడుతూ.. నూతన సాంకేతికతతో..
- Sports
భారత క్రీడల్లో స్వర్ణ యుగం మొదలైంది: నరేంద్ర మోదీ
- Automobiles
మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450
- Technology
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
- Lifestyle
ముద్దొచ్చే బుజ్జాయిలను ముద్దాడనివ్వొద్దు
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
Major 16 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 19 కోట్లకు అమ్మితే.. మహేశ్‌కు లాభం ఎంతో తెలుసా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల చిత్రాలు వస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటాయి. అలాంటి వాటిలో విలక్షణ హీరో అడివి శేష్ నటించిన 'మేజర్' ఒకటి. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ 16 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

మేజర్‌గా మారిపోయిన అడివి శేష్
అడివి శేష్ హీరోగా శశి కిరణ తిక్కా రూపొందించిన చిత్రమే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి మహేష్‌బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేయగా.. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు చేశారు.
హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులు

భారీ అంచనాలతో బిజినెస్ ఇలా
అడివి శేష్ హీరోగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడైంది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ అయింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 18 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మేజర్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 15వ రోజు కేవలం రూ. 5 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి. అయితే, 16వ రోజు కాస్త పెరిగి ఈ సినిమాకు రూ. 8 లక్షల షేర్ వచ్చింది.
మళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్: పైన ఏమీ లేకుండానే అందాల ఆరబోత

16 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?
రెండు రాష్ట్రాల్లో 'మేజర్' 16 రోజుల్లో బాగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 8.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 91 లక్షలు, గుంటూరులో రూ. 1.14 కోట్లు, కృష్ణాలో రూ. 1.07 కోట్లు, నెల్లూరులో రూ. 68 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.33 కోట్లు షేర్, రూ. 28.90 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
16 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 17.33 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు, ఓవర్సీస్లో రూ. 6.12 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 5.70 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 16 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 31.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 58.70 కోట్లు గ్రాస్ వచ్చింది.
బ్రాతో హీరోయిన్ ఎద అందాల విందు: లేటు వయసులోనూ శృతి మించిన హాట్ షో

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
సక్సస్ఫుల్ కాంబోలో రూపొందిన 'మేజర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 113 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో అడివి శేష్ సినిమాకు రూ. 31.20 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు ఇప్పటికే రూ. 12.20 కోట్ల లాభాలు కూడా వచ్చాయి.