Major 17 Days Collections: మళ్ళీ కొంత పెరిగిన కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ న్యూ రికార్డ్
తెలుగు చిత్ర పరిశ్రమలో సోలోగా ఎదిగిన అడవి శేష్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా వీటివల్ల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని స్థాయిలో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక నిన్నటితో 17 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎంత వరకు లాభాలను అందించింది అనే వివరాల్లోకి వెళితే..

బయోపిక్ ద్వారా మంచి క్రేజ్
టాలెంటెడ్ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అడవి శేష్ రచయితగా కూడా వరుస సినిమాలతో మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మేజర్ సినిమాతో కూడా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాకు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థతో సంయుక్తంగా నిర్మించారు. శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్
అడివి శేష్ హీరోగా తెరకెక్కిన 'మేజర్' మూవీ సినిమా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదలైంది. ఈ సినిమాపై విడుదలకు ముందే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. వరల్డ్ వైడ్ గా తెలుగులో ఈ సినిమా రూ. 13 కోట్ల బిజినెస్ చేసినట్లు టాక్. ఇక హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ చేయగా.. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 18 కోట్ల మేర బిజినెస్ చేసింది.

17వ రోజు కలెక్షన్స్
'మేజర్' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఇక ఫస్ట్ వీక్ అనంతరం మాత్రం కలెక్షన్స్ తగ్గఅయి. ఇక 16వ రోజు మా కేవలం రూ. 8 లక్షలు మాత్రమే రాగా 17వ రోజు మాత్రం కాస్త పెరిగి 15 లక్షల షేర్ వచ్చింది. వీకెండ్ కావడంతో జనాలు మేజర్ సినిమాపై కాస్త ఎక్కువగా ఫోకస్ చేశారు.

టోటల్ 17 రోజుల కలెక్షన్స్
రెండు రాష్ట్రాల్లో 'మేజర్' సినిమా 17 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ. 8.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.89 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.42 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 91 లక్షలు, గుంటూరులో రూ. 1.16 కోట్లు, కృష్ణాలో రూ. 1.10 కోట్లు, నెల్లూరులో రూ. 68 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో టోటల్ గా రూ. 17.48 కోట్లు షేర్, రూ. 29.15 కోట్లు గ్రాస్ వసూళ్ళు వచ్చాయి.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
17 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 17.48 కోట్ల షేర్ రాబట్టిమా 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగా కూడా పరవాలేదు అనే విధంగా మంచి కలెక్షన్స్ అందుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.04 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.18 కోట్లు వసూలు చేసింది. అలాగే మిగతా భాషల్లో ఇంకా హిందీలో రూ. 6.20 కోట్లు వచ్చాయి. ఇక 17 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా మేజర్ సినిమాకు రూ. 31.90 కోట్లు షేర్‌తో పాటు రూ. 60.60 కోట్లు గ్రాస్ దక్కింది.

మొత్తం వచ్చిన లాభాలు ఎంతంటే?
'మేజర్' సినిమా విడుదలకు ముందు నుంచే ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అంచనాలకు అనుగుణంగానే వరల్డ్ వైడ్ గా రూ. 18 కోట్లు బిజినెస్ చేసిన మేజర్ 18 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది. ఇక 17 రోజుల్లో మేజర్ సినిమాకు రూ. 31.90 కోట్ల షేర్ దక్కింది. దీంతో బ్లాక్ బస్టర్ దిశగా ఈ సినిమాగా క 12.90 కోట్ల ప్రాఫిట్స్ తో అడివి శేష్ కెరీర్ లో ఒక రికార్డును క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











