Major 1st Week Collections: 19 కోట్లకు అమ్మితే.. వారంలోనే అన్ని కోట్లు.. లాభాలు ఎంతో తెలిస్తే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే మనసుకు దగ్గరైపోతుంటాయి. అలా ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలు రూపొందాయి. అందులో అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' ఒకటి. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించడంతో మంచి బిజనెస్‌ను చేసుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఇక, అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా టార్గెట్‌ను దాటేసి లాభాల బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ వారం రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

మేజర్‌గా మారిపోయిన అడివి శేష్

మేజర్‌గా మారిపోయిన అడివి శేష్

అడివి శేష్ టైటిల్ రోల్‌లో శశి కిరణ తిక్కా తెరకెక్కించిన మూవీనే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేసింది. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు చేశారు.

భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడుపోయింది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తంగా రూ. 18 కోట్ల మేర బిజినెస్ అయింది.

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'మేజర్'కు ఏపీ, తెలంగాణలో 7వ రోజు కలెక్షన్లు మరింత పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 56 లక్షలు షేర్, రూ. 90 లక్షలు గ్రాస్ వచ్చింది.

ఫస్ట్ వీక్‌లో ఎంత వసూలైంది?

ఫస్ట్ వీక్‌లో ఎంత వసూలైంది?

వారం రోజుల్లోనూ 'మేజర్' ఆంధ్రా, తెలంగాణలో రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 6.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.64 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.82 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 79 లక్షలు, గుంటూరులో రూ. 98 లక్షలు, కృష్ణాలో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 60 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 14.95 కోట్లు షేర్, రూ. 25 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో రూ. 14.95 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 3.50 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 7 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 25.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 46.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'మేజర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, వారంలోనే దీనికి రూ. 25.60 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌‌తో పాటు ఇప్పటికే రూ. 6.60 కోట్ల మేర లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X