Major 2 Days Collections: శనివారం మేజర్‌కు భారీ వసూళ్లు.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు ఏంటి సామీ
విభిన్నమైన చిత్రాలు.. విలక్షణమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. కెరీర్ ఆరంభంలో విలన్‌గా నటించిన అతడు.. హీరోగా మారిన తర్వాత సత్తా చాటుతున్నాడు. అంతేకాదు, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంతో పాటు ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అడివి శేష్ ప్రస్తుతం 'మేజర్' అనే సినిమాలో నటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీ శుక్రవారమే విడుదలైంది. దీనికి అన్ని ఏరియాల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'మేజర్' 2 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

మేజర్‌గా మారిపోయిన యంగ్ హీరో
అడివి శేష్ హీరోగా శశి కిరణ తిక్కా తెరకెక్కించిన సినిమానే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేసింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో ఈ మూవీ రూపొందింది.

భారీ అంచనాలతో ప్రీ బిజినెస్ ఇలా
రియల్ స్టోరీతో రూపొందిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన ప్రతి అప్‌డేట్‌కు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడుపోయింది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తంగా రూ. 18 కోట్ల మేర వ్యాపారం జరిగింది.

రెండో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'మేజర్'కు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజూ మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 47 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.61 కోట్లు షేర్, రూ. 6.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ కలిపి ఎంత వచ్చింది
రెండు రోజుల్లోనూ ఏపీ, తెలంగాణలో 'మేజర్' సత్తా చాటాడు. ఫలితంగా నైజాంలో రూ. 3.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 87 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 98 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 65 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 44 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 7.68 కోట్లు షేర్, రూ. 12.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది
ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 7.68 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 55 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4.20 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 1.05 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 13.48 కోట్లు షేర్‌తో పాటు రూ. 25.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
అడివి శేష్ హీరోగా రియల్ స్టోరీతో వచ్చిన 'మేజర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లోనే దీనికి రూ. 13.48 కోట్లు వచ్చాయి. అంటే మరో 5.52 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











