Major 2 Weeks Collections: 19 కోట్లు బిజినెస్.. 2 వారాల్లోనే భారీగా.. మహేశ్‌కు లాభమెంతో తెలిస్తే!
విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాలెంట్ ఉన్న హీరోల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు అడివి శేష్. విలన్ పాత్రలతో కెరీర్‌ను ఆరంభించిన అతడు.. సోలో హీరోగా బాగా సక్సెస్ అయ్యాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే శేష్ 'మేజర్' అనే ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ మూవీకి అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా దీనికి ఆరంభం నుంచీ కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ 2 వారాల బాక్సాఫీస్ కలెక్షన్లను చూద్దాం పదండి!

మేజర్‌గా అడివి శేష్ అరాచకం
అడివి శేష్ టైటిల్ రోల్‌లో శశి కిరణ తిక్కా తెరకెక్కించిన బయోపిక్ మూవీనే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేయగా.. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు చేశారు.

భారీ అంచనాలతో బిజినెస్ ఇలా
అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లకు స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడైంది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ అయింది. మొత్తంగా దీనికి అన్ని ఏరియాలను కలిపి రూ. 18 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో రూపొందిన 'మేజర్' మూవీకి ఆరంభంలో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సత్తా చాటింది. ఫలితంగా అన్ని ఏరియాల్లో టార్గెట్‌ను చేరుకుంది. అయితే, రెండో వారం నుంచి వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 14వ రోజు మేజర్‌కు ఏపీ, తెలంగాణలో రూ. 7 లక్షల షేర్ మాత్రమే వచ్చింది.

2 వారాల్లో ఎంత కలెక్ట్ అయింది?
2 వారాలకు చూస్తే 'మేజర్' రెండు రాష్ట్రాల్లో బాగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 8.07 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.86 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, గుంటూరులో రూ. 1.13 కోట్లు, కృష్ణాలో రూ. 1.06 కోట్లు, నెల్లూరులో రూ. 67 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.20 కోట్లు షేర్, రూ. 28.66 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఏపీ, తెలంగాణలో 2 వారాల్లో రూ. 17.20 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.96 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.08 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 5.40 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 14 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 30.64 కోట్లు షేర్‌తో పాటు రూ. 57.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
అడివి శేష్ హీరోగా మహేశ్ నిర్మించిన 'మేజర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 113 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో అడివి శేష్ సినిమాకు రూ. 30.64 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు ఇప్పటికే రూ. 11.64 కోట్ల లాభాలు కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











