Major 3 Days Collections: 3 రోజుల్లోనే అన్ని కోట్ల టార్గెట్ ఔట్.. తెలుగులో 6వ మూవీగా మేజర్ రికార్డ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. తద్వారా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు అంచనాలను ఏర్పరచుకుంటాయి. అలాంటి వాటిలో అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' ఒకటి. ఉగ్ర దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా బజ్ ఏర్పడింది. దీంతో ఇది ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'మేజర్' మూడో రోజే టార్గెట్ ఫినీష్ చేసింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టును చూసేద్దామా!

మేజర్‌గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో

మేజర్‌గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో

అడివి శేష్ - శశి కిరణ తిక్కా కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేసింది. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు చేశారు.

భారీ అంచనాలతో ప్రీ బిజినెస్ ఇలా

భారీ అంచనాలతో ప్రీ బిజినెస్ ఇలా

క్రేజీ కాంబినేషన్‌లో 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన ప్రతి అప్‌డేట్‌కు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడుపోయింది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తంగా రూ. 18 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

మూడో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

మూడో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'మేజర్'కు ఏపీ, తెలంగాణలో 3వ రోజూ మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 44 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.57 కోట్లు షేర్, రూ. 5.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకూ కలిపి ఎంత వచ్చింది

3 రోజులకూ కలిపి ఎంత వచ్చింది


ఆంధ్రా, తెలంగాణలో 'మేజర్' 3 రోజుల్లోనూ సత్తా చాటాడు. ఫలితంగా నైజాంలో రూ. 5.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 71 లక్షలు, నెల్లూరులో రూ. 50 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 11.25 కోట్లు షేర్, రూ. 18.80 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది


తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో రూ. 11.25 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.70 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 2.15 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 19.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 35.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

టాలీవుడ్‌లో ఆరో సినిమాగా రికార్డ్

టాలీవుడ్‌లో ఆరో సినిమాగా రికార్డ్

అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసింది. దీంతో ఈ ఏడాది విజయం సాధించిన 6వ టాలీవుడ్ మూవీగా ఇది రికార్డును క్రియేట్ చేసుకుంది. దీనికితోడు అడివి శేష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగానూ ఇది ఘనతను అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X