twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Major 3 Weeks Collections: 18 కోట్ల బిజినెస్.. 3 వారాల్లో రికార్డు స్థాయిలో.. మహేశ్‌కు లాభం ఎంతంటే!

    |

    విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. కెరీర్ ఆరంభం నుంచీ ప్రత్యేకమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ యంగ్ హీరో.. కొద్ది రోజుల క్రితమే 'మేజర్' అనే చిత్రంతో వచ్చాడు. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీని మహేశ్ బాబు నిర్మించాడు. ఫలితంగా దేశ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ మూడు వారాల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    మేజర్‌గా ఎంట్రీ ఇచ్చేసిన శేష్

    మేజర్‌గా ఎంట్రీ ఇచ్చేసిన శేష్

    అడివి శేష్ - శశి కిరణ తిక్కా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేయగా.. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు పోషించారు.

    స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!స్విమ్మింగ్ పూల్‌లో నందినీ రాయ్ అందాల ఆరబోత: వామ్మో మరీ ఇంత హాట్‌గానా!

    భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

    భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

    సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో అడివి శేష్ నటించిన ‘మేజర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడైంది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ అయింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 18 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

    21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    21వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    వీర జవాన్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మేజర్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో వారంలో ఈ చిత్రానికి చాలా తక్కువ వసూళ్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో 21వ రోజు ఈ సినిమాకు రూ. 2 లక్షలే వసూలు అయ్యాయి.

    ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!ఇన్నర్స్ లేకుండా షాకిచ్చిన పాయల్: వామ్మో ఆరబోతలో హద్దు దాటేసిందిగా!

    3 వారాల్లో ఎంత కలెక్ట్ అయింది?

    3 వారాల్లో ఎంత కలెక్ట్ అయింది?

    రెండు రాష్ట్రాల్లో ‘మేజర్' 3 వారాల్లో బాగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 8.23 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.42 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 91 లక్షలు, గుంటూరులో రూ. 1.17 కోట్లు, కృష్ణాలో రూ. 1.12 కోట్లు, నెల్లూరులో రూ. 68 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.65 కోట్లు షేర్, రూ. 29.45 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    3 వారాల్లో ఏపీ, తెలంగాణలో రూ. 17.65 కోట్లు కొల్లగొట్టిన ‘మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.22 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 6.60 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 21 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 32.57 కోట్లు షేర్‌తో పాటు రూ. 62.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Chor Bazaar Twitter Review: ఆకాశ్ సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!Chor Bazaar Twitter Review: ఆకాశ్ సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!

    Recommended Video

    Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu
    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘మేజర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, 3 వారాల్లో అడివి శేష్ సినిమాకు రూ. 32.57 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌‌తో పాటు ఇప్పటికే రూ. 13.57 కోట్ల లాభాలు కూడా సొంతం అయ్యాయి.

    English summary
    Tollywood Young Hero Adivi Sesh did Major Movie Under Sashi Kiran Tikka Direction. This Movie Collect 32.57 Cr in 3 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X