Major 4 Days Collections: నాలుగో రోజు కలెక్షన్స్ లో డ్రాప్.. అయినా ఎన్ని కోట్ల లాభమో తెలుసా?

అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' సినిమా ప్రకటించిన నాటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఉగ్ర దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా ప్రకటించిన నాటి నుంచి మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏర్పడిన అంచనాలకు అనుగుణంగానే ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మూడో రోజే టార్గెట్ ఫినీష్ చేసిన 'మేజర్' నాలుగో రోజు ఎంత కలెక్ట్ చేసింది అనే రిపోర్టు పరిశీలిద్దాం.

'మేజర్'

'మేజర్'

అడివి శేష్ హీరోగా నటిస్తూ కధ అందించగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో లో రూపొందిన సినిమా 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌ గా నటించగా శోభిత ధూళిపాళ్ల కీలక పాత్ర చేసింది. ప్రకాష్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు చేశారు. ఇక ఈ సినిమాను సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించగా శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్

19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'మేజర్' మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడుపోయింది. హిందీ వెర్షన్ ఒక్కటే రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తంగా రూ. 18 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఈ సినిమాకి 19 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

తగ్గిన కలెక్షన్స్

తగ్గిన కలెక్షన్స్

'మేజర్'కు ఏపీ, తెలంగాణలో 4వ రోజు మూడు రోజులతో పోలిస్తే కలెక్షన్స్ తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 71 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.34 కోట్లు షేర్, రూ. 2.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

నాలుగు రోజులకు ఎంతంటే?

నాలుగు రోజులకు ఎంతంటే?

ఆంధ్రా, తెలంగాణలో 'మేజర్' 4 రోజుల్లో కలిపితే సత్తా చాటినట్టే చెప్పాలి. ఈ క్రమంలో నైజాంలో రూ. 5.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.42 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.57 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.05 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 69 లక్షలు, గుంటూరులో రూ. 82 లక్షలు, కృష్ణాలో రూ. 78 లక్షలు, నెల్లూరులో రూ. 54 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 12.59 కోట్లు షేర్, రూ. 21.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఎన్ని కోట్ల లాభం అంటే

ఎన్ని కోట్ల లాభం అంటే

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో రూ. 12.59 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. దీంతో కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.90 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 2.70 కోట్లు వచ్చాయి. అలా మొత్తం కలిపి 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 21.54 కోట్లు షేర్‌తో పాటు రూ. 39.50 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేయగా ఈ ఏడాది విజయం సాధించిన 6వ టాలీవుడ్ మూవీగా ఇది రికార్డును క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతానికి 2.54 కోట్ల లాభాలతో దూసుకు పోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X