Major 6 Days Collections: కలెక్షన్లలో బిగ్ డ్రాప్.. తొలిసారి ఇంత తక్కువ.. లాభం మాత్రం అన్ని కోట్లు

విలన్ పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. తనదైన విలక్షణ నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు. దీంతో అతడి మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలోనే అడివి శేష్ ఇటీవలే 'మేజర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ ఆరు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

మేజర్‌గా రంగంలోకి దిగిన అడివి శేష్

మేజర్‌గా రంగంలోకి దిగిన అడివి శేష్

అడివి శేష్ హీరోగా శశి కిరణ తిక్కా తెరకెక్కించిన సినిమానే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేసింది. ఈ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో తెరకెక్కింది.

భారీ అంచనాలతో ప్రీ బిజినెస్ ఇలా

భారీ అంచనాలతో ప్రీ బిజినెస్ ఇలా

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన ప్రతి అప్‌డేట్‌కు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడుపోయింది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తంగా రూ. 18 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

ఆరవ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

ఆరవ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'మేజర్'కు ఏపీ, తెలంగాణలో 6వ రోజూ మంచి స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 73 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

6 రోజులకూ కలిపి ఎంత వచ్చింది

6 రోజులకూ కలిపి ఎంత వచ్చింది

'మేజర్' మూవీ ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లోనూ రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 6.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.59 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.76 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.19 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 77 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 89 లక్షలు, నెల్లూరులో రూ. 59 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 14.39 కోట్లు షేర్, రూ. 24.10 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది

తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో రూ. 14.39 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.32 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 3.20 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 24.46 కోట్లు షేర్‌తో పాటు రూ. 44.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజుల్లోనే దీనికి రూ. 24.46 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌‌తో పాటు ఇప్పటికే రూ. 5.46 కోట్ల మేర లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X