Major 8 Days Collections: మేజర్‌కు బిగ్ షాక్.. సగానికి సగం కలెక్షన్లు డౌన్.. లాభాలు చూస్తే షాకే!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో మంది టాలెంట్ ఉన్న హీరోలు ఉన్నారు. అందులో విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న అడివి శేష్ ఒకడు. కెరీర్ ఆరంభంలో విలన్‌గా నటించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అలా ఆరంభంలోనే పలు విజయాలను సైతం దక్కించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'మేజర్' అనే సినిమా శేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. దీనికి ఆరంభంలో మంచి కలెక్షన్లే వచ్చినా.. క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ 8 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లను చూద్దాం పదండి!

మేజర్‌గా ఎంట్రీ ఇచ్చేసిన శేష్

మేజర్‌గా ఎంట్రీ ఇచ్చేసిన శేష్


అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ తిక్కా తెరకెక్కించిన బయోపిక్ మూవీనే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేసింది. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు పోషించారు.

భారీ అంచనాలతో బిజినెస్ ఇలా

భారీ అంచనాలతో బిజినెస్ ఇలా


హిట్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడుపోయింది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తంగా రూ. 18 కోట్ల బిజినెస్ జరిగింది.

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

'మేజర్'కు ఏపీ, తెలంగాణలో 8వ రోజు కలెక్షన్లు మరింత తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 38 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వచ్చింది.

 8 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?

8 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?


8 రోజుల్లోనూ 'మేజర్' ఆంధ్రా, తెలంగాణలో బాగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 7.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.86 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.26 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 81 లక్షలు, గుంటూరులో రూ. 1.01 కోట్లు, కృష్ణాలో రూ. 94 లక్షలు, నెల్లూరులో రూ. 61 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 15.33 కోట్లు షేర్, రూ. 25.60 కోట్లు గ్రాస్ దక్కింది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఏపీ, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 15.33 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.70 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 3.90 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 26.63 కోట్లు షేర్‌తో పాటు రూ. 48.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

అడివి శేష్ హీరోగా వచ్చిన 'మేజర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లోనే దీనికి రూ. 26.63 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌‌తో పాటు ఇప్పటికే రూ. 7.63 కోట్ల మేర లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X