Major 9 Days Collections: భారీగా పెరిగిన వసూళ్లు.. 9వ రోజు డబుల్.. లాభాలు ఎన్ని కోట్లో తెలిస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో బయోపిక్ మూవీలు వచ్చాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే అందరి దృష్టినీ ఆకర్షించుకుని భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంటాయి. అలాంటి వాటిలో విలక్షణ నటుడు అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్' ఒకటి. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే గత వారం ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. దీనికి ఆరంభం నుంచీ కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం కాస్త ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ 9 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లను చూద్దాం పదండి!

మేజర్‌గా మారిపోయిన అడివి శేష్
అడివి శేష్ హీరోగా శశి కిరణ తిక్కా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రమే 'మేజర్'. ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర చేయగా.. ప్రకాశ్ రాజ్, రేవతి ముఖ్య పాత్రలు పోషించారు.

భారీ అంచనాలతో బిజినెస్ ఇలా
మహేశ్ బాబు నిర్మాణంలో శేష్ హీరోగా చేసిన 'మేజర్' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడైంది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ అయింది. మొత్తంగా దీనికి రూ. 19 కోట్ల బిజినెస్ జరిగింది.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
ఏపీ, తెలంగాణలో 'మేజర్'కు 9వ రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 58 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

9 రోజుల్లో ఎంత కలెక్ట్ అయింది?
'మేజర్' మూవీ 9 రోజుల్లోనూ రెండు రాష్ట్రాల్లో బాగా రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 7.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.73 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.93 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.31 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.05 కోట్లు, కృష్ణాలో రూ. 97 లక్షలు, నెల్లూరులో రూ. 63 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 15.91 కోట్లు షేర్, రూ. 26.55 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 15.91 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.80 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 4.30 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 27.76 కోట్లు షేర్‌తో పాటు రూ. 50.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
బయోపిక్ మూవీగా వచ్చిన 'మేజర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లోనే అడివి శేష్ నటించిన ఈ సినిమాకు రూ. 27.76 కోట్లు వచ్చాయి. ఫలితంగా క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు ఇప్పటికే రూ. 8.76 కోట్ల లాభాలు కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











