Major Day 1 Collections: చరిత్ర సృష్టించిన అడివి శేష్.. మేజర్‌కు తొలిరోజే షాకింగ్‌గా!
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న వారిలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఒకడు. అతడు తాజాగా నటించిన 'మేజర్' చిత్రమే దీనికి కారణం. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడంతో ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు దీని నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్లకు భారీ రెస్పాన్స్ రావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇలా ఎంతో హైప్‌తో ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే దీనికి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో షోలన్నీ ప్రేక్షకులతో కళకళలాడాయి. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

మేజర్‌గా ఎంట్రీ ఇచ్చిన అడివి శేష్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన తాజా చిత్రమే 'మేజర్'. శశి కిరణ తిక్కా తెరకెక్కించిన ఈ మూవీలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా చేసింది. దీన్ని ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రను పోషించింది.

భారీ అంచనాలతో ప్రీ బిజినెస్ ఇలా
'మేజర్' మూవీపై ఆది నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్లకు అమ్ముడుపోయింది. హిందీ వెర్షన్ మాత్రం రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. మొత్తంగా రూ. 18 కోట్ల వ్యాపారం జరిగింది.

మొదటి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'మేజర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 51 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 30 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 4.07 కోట్లు షేర్, రూ. 6.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టింది
తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 4.07 కోట్లు కొల్లగొట్టిన 'మేజర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.35 కోట్లు వసూలు చేసింది. అలాగే, హిందీలో రూ. 35 లక్షలు వచ్చాయి. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 7.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 13.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
అడివి శేష్ - శశి కిరణ్ తిక్కా కాంబినేషన్‌లో వచ్చిన 'మేజర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 7.12 కోట్లు వచ్చాయి. అంటే మరో 11.88 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

చరిత్ర సృష్టించిన ‘మేజర్' శేష్
విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అడివి శేష్.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాలను చేశాడు. కానీ, 'మేజర్' మాత్రం అతడికి మరింత పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. అంతేకాదు, ఈ సినిమా ద్వారా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను అందుకుని శేష్ చరిత్ర సృష్టించాడు. ఈ ఊపు చూస్తుంటే వీకెండ్‌లోనే టార్గెట్ ఫినీష్ అయ్యేలా ఉంది.


Click it and Unblock the Notifications











