HIT 2 Pre Release Bussiness: అడివి శేష్ ముందు మరో బిగ్ టార్గెట్.. మొత్తం ఎంత రావాలంటే?
అడివి శేష్ నటించిన హిట్ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. 2020లో వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా డిమాండ్ ను బట్టి మార్కెట్లో మంచి బిజినెస్ కూడా చేసింది. ఇక మొత్తంగా హిట్ 2 సెకండ్ కేస్ సినిమా ఏ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళ్తే..

మార్కెట్ లో హై డిమాండ్
యువ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 2 సినిమాను హీరో నాని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు టీజర్ తో పాటు ట్రైలర్ కూడా అంచనాల స్థాయిని మరింత పెంచింది. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరగడంతో బిజినెస్ వాల్యూ కూడా పెరిగింది.

నైజాం, సీడెడ్ బిజినెస్
అడవి శేష్ కెరీర్ లోనే తెలుగులో ఈ సినిమా అత్యధిక స్థాయిలో బిజినెస్ చేసినట్లు సమాచారం.. ఈ సినిమా నైజాం హక్కులు కోసం చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు పోటీపడ్డారు. 5 కోట్లకు అమ్ముడు అయినట్లు సమాచారం. ఇక సీడెడ్ లో కూడా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడగా మొత్తంగా 2 రెండు కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో..
ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొత్తంగా హిట్ సెకండ్ కేసు సినిమా 7 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తంగా హిట్ సినిమా 14.5 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఒక విధంగా ఈ టార్గెట్ ను సినిమా అందుకుంటుందా లేదా అనేది మొదటిరోజు టాక్ ను బట్టి తెలుస్తుంది. తప్పకుండా కొన్ని ఏరియాల్లో అయితే చాలా తొందరగానే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అని టాక్ అయితే వినిపిస్తోంది.

వరల్డ్ వైడ్ బిజినెస్
ఇక హిట్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళ్తే.. రెస్టాఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కలుపుకొని మొత్తంగా 3.5 ఐదు కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హిట్ 2 సినిమా 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ గా కూడా ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలను అందించింది.

టార్గెట్ ఎంతంటే..
ఇక ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వరకు బిజినెస్ ఈ సినిమా టార్గెట్ 18.50 కోట్లకు ఫిక్స్ అయింది. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని రోజుల్లో అందుకుంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా మేజర్ సినిమాతో మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. ఇక ప్రస్తుతం హడావిడి చూస్తూ ఉంటే అడ్వాన్స్ బుకింగ్స్ తో కూడా హిట్ 2 సినిమా రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి మొత్తంగా బాక్సాఫీస్ వద్ద నిర్మాతకు ఏ స్థాయిలో ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











