చారిత్రక సినిమాకు షాక్: బూతు సినిమాకు భారీ రెస్పాన్స్.. రికార్డులు బద్దలైపోతున్నాయి

By Manoj

భారీ బడ్జెట్‌, చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కిన సినిమా ఒకవైపు, వివాహేతర సంబంధం.. బూతు కంటెంట్‌తో వచ్చిన చాలా చిన్న సినిమా మరోవైపు. ఈ రెండు సినిమాల్లో దేనికి మీరు ఓటేస్తారని ఎవరినీ అడిగే సాహసం చేయకూడదు. ఎందుకంటే దీనికి ప్రస్తుత జనరేషన్ ఎలాంటి సమాధానం చెబుతుందో అందరికీ తెలిసిందే. అవును.. రెండో సినిమాకే ఎక్కువగా ఓట్లు పడతాయి. ఇప్పుడిదే తరహాలో సినిమాల ఫలితాలు కూడా వచ్చేశాయి. చారిత్రక సినిమాకు షాకిచ్చిన ప్రేక్షకులు.. బూతు సినిమాను మాత్రం భారీ స్థాయిలో ఆదరిస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమాలు..?

యుద్ధాన్ని ప్రధానంగా తీసుకుని చేశారు

యుద్ధాన్ని ప్రధానంగా తీసుకుని చేశారు

మూడవ పానిపట్‌ యుద్ధం కథాంశంగా రూపొందిన చారిత్రక చిత్రం ‘పానిపట్‌'. అశుతోష్‌ గోవర్‌కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సునీత గోవర్‌కర్, రోహిత్‌ షీలాత్కర్‌లు నిర్మించారు. సంజయ్‌ దత్, అర్జున్‌ కపూర్, కృతిసనన్‌లు కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వివాహేతర సంబంధం నేపథ్యంలో..

వివాహేతర సంబంధం నేపథ్యంలో..

బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పతి పత్నీ ఔర్ వో'. భూమి పెడ్నేకర్, అనన్య పాండే కీలక పాత్రలు చేసిన ఈ సినిమాను ముదస్సర్ అజీజ్ తెరకెక్కించారు. ఇంట్లో ఇల్లాలిని ప్రేమిస్తూనే, ఆఫీస్‌లో ఓ యువతితో ప్రేమాయణం సాగించే వ్యక్తి కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇది కూడా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఫేమస్ యాక్టర్లు ఉన్నా ఇంతే

ఫేమస్ యాక్టర్లు ఉన్నా ఇంతే

‘పానిపట్‌' సినిమాలో అందరికీ సుపరిచితులు అయిన యాక్టర్లు ఉన్నారు. దీనికి తగ్గట్లే చిత్ర ప్రమోషన్ కూడా నిర్వహించారు. పలుమార్లు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ హైప్ క్రియేట్ చేశారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చారిత్రక సినిమా తొలి రెండు రోజుల్లో రూ. 10 కోట్లు కూడా దాటలేకపోయింది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
బూతు మూవీ మాత్రం భారీ స్థాయిలో

బూతు మూవీ మాత్రం భారీ స్థాయిలో

ఇక, బూతు కంటెంట్‌తో వచ్చిన ‘పతి పత్నీ ఔర్ వో'కు మాత్రం బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది. మొదటి రోజు రూ. 8.50 కోట్లు, రెండో రోజు రూ. 11.75 కోట్లు వసూలు చేసింది. దీంతో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X