RRR Japan Collections: 100 రోజులు పూర్తి చేసుకొని సంచలన రికార్డు.. ఆస్కార్ దెబ్బకు మళ్ళీ పెరిగిన కలెక్షన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి కలిసిన నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం RRR సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం. దర్శక ధీరుడు రాజమౌళి తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా జపాన్లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా ఇటీవల ఈ సినిమా 100 రోజులను కూడా పూర్తి చేసుకుని అత్యధిక ప్రాఫిట్ అందించిన ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

జపాన్ లో ఫస్ట్ వీక్ అలా..

జపాన్ లో ఫస్ట్ వీక్ అలా..

బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా అసలు ఇండియాలో సక్సెస్ అవుతుందా లేదా అనే విధంగా ముందు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా విదేశీ సినీ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను జపాన్లో చాలా ఆలస్యంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అక్కడ ఈ సినిమా జపాన్ భాషలో మొదటి వారంలో కేవలం 81 విలియన్ జపానీస్ కరిన్సీని అందుకుంది.

పెరుగుతూ వచ్చిన కలెక్షన్స్

పెరుగుతూ వచ్చిన కలెక్షన్స్

RRR సినిమా మెల్లమెల్లగా ప్రతివారం కూడా కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్లడం విశేషం. జపాన్ లో ప్రత్యేకంగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వారికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కంటెంట్ కనెక్ట్ కావడంతో ఆడియన్స్ మౌత్ టాక్ ద్వారానే ప్రతి వారం కూడా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి.

ఆస్కార్ ఎఫెక్ట్

ఆస్కార్ ఎఫెక్ట్

ఇక నాలుగో వారం నుంచి ఎనిమిదో వారం వరకు ఈ సినిమా కలెక్షన్స్ అంతగా పెరగలేదు. కానీ మళ్ళీ తొమ్మిదవ వారం నుంచి ఒక్కసారిగా కలెక్షన్స్ పెరగడం విశేషం. ఎందుకంటే ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ తో పాటు ఆస్కార్ నామినేషన్ లో కూడా ఉంటుంది అని కథనాలు రావడంతో మళ్లీ ఒక్కసారిగా అందరి ఫోకస్ ఈ సినిమాపై పడడంతో జపాన్ లో కలెక్షన్స్ పెరిగిపోయాయి.

జపాన్ లో 100 రోజుల కలెక్షన్స్

జపాన్ లో 100 రోజుల కలెక్షన్స్

ఇక రీసెంట్ గా ఈ సినిమా కలెక్షన్స్ మళ్ళీ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండేసరికి నెంబర్స్ పెరిగిపోయాయి. 100 రోజులను పూర్తి చేసుకోవడం కూడా విశేషం. జపాన్లో ఇప్పటివరకు జపాన్ లో అత్యధిక రోజులు ప్రదర్శింపబడిన ఇండియన్ చిత్రాల్లో RRR సినిమా నిలవడమే కాకుండా మొత్తంగా అక్కడ 114 కేంద్రాలలో 100 రోజులను పూర్తి చేసుకుంది. దీంతో 715 మిలియన్ జపనీస్ కరెన్సీని అందుకోవడం విశేషం. అంటే మన ఇండియన్ కరెన్సీలో 43 కోట్లు.

మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

RRR సినిమా జపనీస్ లో విడుదల కాకముందు ప్రపంచవ్యాప్తంగా 1152 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇప్పుడు జాపనీస్ కలెక్షన్స్ కూడా పెరగడంతో ఆ సంఖ్య 1200 కు చేరువలోకి వస్తోంది. దాదాపు 700 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక షేర్ ప్రాఫిట్ అందించిన సినిమాల్లో కూడా ఇప్పుడు RRR సినిమా ఒక సరికొత్త రికార్డును అందుకోబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X