ప్రభాస్, విజయ్ తరువాత 100కోట్లు డిమాండ్ చేస్తున్న మరో హీరో.. షాకింగ్ రెమ్యునరేషన్!

ఇటీవల కాలంలో చాలా మంది అగ్ర హీరోలు ఒక సినిమా సక్సెస్ కాగానే ఆ తరువాత వచ్చే సినిమాలకు ఎవరూ ఊహించని విధంగా అత్యధిక స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు రెమ్యునరేషన్ పెరగాలి అంటే కాస్త సమయం పట్టేది. కానీ ఇప్పుడు సినిమా సినిమాకు హీరోల స్థాయి మారిపోతుండటంతో మార్కెట్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో పారితోషికాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ విజయ్ సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక స్థాయిలో పారితోషకాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి తరువాత వంద కోట్ల పారితోషికం అందుకుంటున్న హీరోలలో మరొక హీరో చేరినట్లు తెలుస్తోంది. హీరో ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

అడగకపోయినా..

అడగకపోయినా..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది అగ్ర హీరోలు ప్రతి సినిమాకు ఒక్కో తరహాలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఒక్క సక్సెస్ అందుకున్న కూడా వారి మార్కెట్ రేంజ్ ఈజీగా పెరిగిపోతోంది. ఇక నిర్మాతలు కూడా వాళ్లకు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కొంతమంది హీరోలకు అయితే అడగకపోయినా కూడా నిర్మాతలు భారీగా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.

నెంబర్ వన్ ప్రభాస్..

నెంబర్ వన్ ప్రభాస్..

బాహుబలి సినిమా తో ఒక్కసారిగా తన స్టార్ ఇమేజ్ ను పెంచుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా తరువాత మరో సినిమాకు అలాగే రాధే శ్యామ్ సినిమాకు వంద కోట్ల పారితోషికం తీసుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక భవిష్యత్తులో రాబోయే సినిమాలకు డార్లింగ్ అంతకంటే ఎక్కువగా 150 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

విజయ్ కూడా..

విజయ్ కూడా..

ఇక కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటున్న హీరోలలో ఇళయదళపతి విజయ్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు అని చెప్పాలి. ఒక విధంగా రజనీకాంత్ కంటే ఎక్కువగానే విజయ్ ఇటీవల తన మార్కెట్ ను పెంచుకున్నాడు. మాస్టర్ సినిమా తర్వాత అతను చేయబోతున్న బీస్ట్ సినిమాకు భారీగా పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వంశీ పైడిపల్లి దిల్ రాజు కాంబినేషన్ లో చేస్తున్న బై లాంగ్యువల్ సినిమాకు దాదాపు వంద కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

అజిత్ కూడా..

అజిత్ కూడా..

ఇక ప్రభాస్ విజయ్ తర్వాత మరో హీరో కూడా 100 కోట్ల మార్కును అందుకున్నట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు. అజిత్ కుమార్ అని కథనాలు వెలువడుతున్నాయి.
ఇటీవల కాలంలో విజయ్ తర్వాత కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న వారిలో అజిత్ కూడా ఉన్నారు. అజిత్ గత కొంతకాలంగా ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటూ వస్తున్నాడు.

ఆ సినిమా కోసం..

ఆ సినిమా కోసం..

ఇటీవల అజిత్ నటించిన వలిమై సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా అనంతరం మళ్ళీ హెచ్ వినోద్ దర్శకత్వంలోనే తన 62వ సినిమా చేయబోతున్న అజిత్ ఆ సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X