»   »  'టెంపర్' తర్వాత 'బాహుబలి' కి కండక్ట్ చేస్తున్నారు

'టెంపర్' తర్వాత 'బాహుబలి' కి కండక్ట్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి' చిత్రం ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లేట్ నైట్ షో లు అంతకు ముందు రోజు రాత్రి జరగనున్నాయి. మినిమం పది నుంచి 15 వరకూ స్పెషల్ బెనిఫిట్ షో లు జరగనున్నారు. హైదరాబాద్ లో మిడ్ నైట్ దాటిన తర్వాత జరిగే ఈ షోలను ప్రభాస్ ప్యాన్స్ కండక్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఐదు వేల నుంచి ఆరు వేల వరకూ టిక్కెట్ రేట్లు పెడతారని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక కార్తికేయ(రాజమౌళి కుమారుడు) ...హైదరాబాద్ లో మల్లికార్జున దియోటర్ లోని బెనిఫిట్ షో కండెక్టు చేస్తున్నారని సమాచారం. ఈ షోకు రాజమౌళి కుటుంబం మొత్తం హాజరుకానుంది. గతంలో ఎన్టీఆర్ ...టెంపర్ చిత్రానికి సైతం ఇలాంటి షో నే కార్తికేయ కండెక్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలను ఛారిటీ కోసం వేస్తున్నారని చెప్తున్నారు.


అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి' . ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైన సంగతి తెలిసిందే. 2 గంటలు 39 నిముషాలు ఉన్న ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇవ్వటం జరిగింది.


After Temper; Karthikeya conducting for Baahubali

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.


అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని
, చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.


ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.


అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.

English summary
Reportedly, Rajamouli son Karthikeya will be organizing Baahubali special benefit show especially for fans at Mallikharjuna theatre of Hyderabad .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu