Agent day 3 Collections 80 కోట్ల బడ్జెట్..40 కోట్ల బిజినెస్.. 3 రోజుల్లో దారుణంగా కలెక్షన్లు..ఎంత నష్టమంటే?
అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్పై థ్రిల్లర్ ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. తొలి రోజు సాధించిన కలెక్షన్లను వారాంతం వరకు కొనసాగించలేకపోవడం దారుణంగా మారింది. ఈ సినిమా 3వ రోజు ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..
80 కోట్ల బడ్జెట్‌తో ఏజెంట్:ఏజెంట్ చిత్రం స్టోరి డిమాండ్ చేయడంతో పలు దేశాల్లో భారీగా యాక్షన్ సీన్లు తెరకెక్కించారు. ఈ సినిమా వరకు అఖిల్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. ఈ సినిమాను స్టైలిష్‌గా తీసే ప్రయత్నంలో దాదాపు 80 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే అంటే.. 40 కోట్ల వరకు జరిగింది. దాంతో ఈ సినిమాను సుమారు 1120 థియేటర్లలో రిలీజ్ చేశారు.

2 రోజుల్లో ఏపీ, నైజాంలో :ఏజెంట్ సినిమా గత రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.6 కోట్లు, సీడెడ్‌లో 75 లక్షలు, గుంటూరులో 60 లక్షలు, కృష్ణా జిల్లాలో 30 లక్షలు, నెల్లూరు 19 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 35 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 36 లక్షలు, ఉత్తరాంధ్రలో 65 లక్షలు వసూలు చేసింది. దాంతో గత రెండు రోజుల్లో 4.7 కోట్లు రాబట్టింది.

3 రోజుల్లో ఏజెంట్ కలెక్షన్లు:ఇక ఏజెంట్ సినిమా గత మూడు రోజుల కలెక్షన్లు పేలవంగా ఉన్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 8.6 కోట్ల గ్రాస్ 4.95 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో, మలయాళంలో కలిపి 1.6 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 1.7 కోట్లు వసూలు చేయడంతో రెండు రోజుల్లో ఈ చిత్రం 10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఏపీ, కేరళలో కలిపి :ఇక మూడో రోజు ఈ చిత్రం ఏపీ, కేరళ, ఓవర్సీస్‌లో కలిపి 1 కోటి రూపాయలు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 11 కోట్లకుపైగా గ్రాస్, 5 కోట్లకుపైగా షేర్ వసూళ్లను 3 రోజుల్లో రాబట్టింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు ఓ క్లారిటీకి వచ్చేశారు.

ఏ రేంజ్ నష్టమంటే? :ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో 40 కోట్ల మేర థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. దాంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. కనీసం 80 కోట్ల గ్రాస్, 40 కోట్ల షేర్ రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ చిత్రం ప్రస్తుతం 11 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ప్రస్తుతం సాధిస్తున్న కలెక్షన్ల పరిస్థితి చూస్తే.. ఈ సినిమా భారీ నష్టాలతో ముగిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











